Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఇంటి ఖరీదు రూ. 6.5 కోట్లు … కానీ బాత్రూమ్‌కు డోర్ లేదు.. ప్రత్యేకత ఏంటో తెలుసా..

doorless bathroom sold: ఓ బిల్డర్ అమ్మకానికి పెట్టిన ఇల్లు ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీస్తోంది. అద్భుతంగా నిర్మించిన ఈ కట్డడంలో ఓ ప్రత్యేకత ఉంది. డిజైనర్ తన ప్రత్యేకతను ఈ ఇంటి నిర్మాణంలో చూపించాడు..

ఈ ఇంటి ఖరీదు రూ. 6.5 కోట్లు ... కానీ బాత్రూమ్‌కు డోర్ లేదు.. ప్రత్యేకత ఏంటో తెలుసా..
house with doorless bathroom
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 09, 2021 | 6:48 PM

House with Doorless Bathroom: ఇల్లు కట్టాలంటే ఓ ప్లాన్ చేసుకుంటాం.. దానికి కావల్సిన బడ్జెట్‌ కూడా అంచనా వేసుకుంటాం.. ఆ తర్వాత మనకు ఉన్న స్థలంలో ఎలాంటి ఇంటిని నిర్మించాలి.. అదులో ఎన్ని గదులు, ఎన్ని అంతస్థులు ఇలాంటి చాలా ప్లాన్ చేస్తాం.. అయితే ఇందుకు తగ్గట్లుగా మన సివిల్ ఇంజనీయర్ మ్యాప్ ఇస్తుంటారు. అంతే కాకుండా ఇంటిరీయర్ డిజైనర్‌తో ప్రత్యేకంగా ప్లాన్ చేయిస్తుంటాము.

ఓ బిల్డర్ అమ్మకానికి పెట్టిన ఓ విల్లా ఇప్పుడు పెద్ద వైరల్ అవుతోంది. ఇందులో చాలా ప్రత్యేకతలున్నాయి. ఎప్పుడైనా విన్నారా.. కనీసం చూశారా.. లేదా ఇది చదవండి. ఇలాంటి ఇల్లు ఒకటి అమెరికాలో నిర్మించారు. ముందుగా.. ఇంటి ధర తొమ్మిది లక్షల డాలర్లు అంటే సరిగ్గా రూ. 6.5 కోట్ల… అయితే ఈ ఇంటికి చాలా ప్రత్యేకతలున్నాయి. ఇది మూడు అంతస్తుల ఇల్లు, ఇందులో నాలుగు బెడ్ రూములు, మూడు బాత్రూమ్‌లు,  రెస్ట్ రూమ్‌లు, నాలుగు వైపుల బాల్కనీలు, ఇవన్ని చెక్క అంతస్తుల భవనాలు. ఈ ఇల్లు 2001 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దీనికి పెద్ద పార్కింగ్ స్థలం కూడా ఉంది.

ప్రపంచంలో ఇలాంటి ఇళ్ళు చాలా ఉన్నాయి. వీటి విలువ కోట్లల్లో ఉంటుంది. ఈ ఇళ్లలో ఒకటి కంటే ఎక్కువ ప్రత్యేకతలు ఉన్నాయి. కానీ.., ఈ రోజు మీరు చదవబోతున్న ఇల్లు అంతకంటే చాలా ప్రత్యేకతలున్న.. చాలా అందమైన, ఆకర్షణీయంగా నిర్మించినది. అయితే ఈ ఇంట్లో విలాసవంతమైన బాత్రూమ్ ఉంది. కానీ బాత్రూంకు తలుపులు లేవు. అవును ఇది నిజం..

ఈ ఇంటిని అమెరికాలోని బోస్టన్‌లో నిర్మించారు. ఈ ఇంటి ధర తొమ్మిది లక్షల డాలర్లు అంటే 6.5 కోట్ల రూపాయలు. ఈ ఇంటిలోకి ప్రవేశించడంతో ముందుగా సాధారణ ఇల్లులా కనిపిస్తుంది. కానీ, మీరు లోపలికి ప్రవేశించినప్పుడు..ఈ ఇంటి బాత్రూమ్ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే, బాత్రూంలో తలుపు లేదా గోడ లేదు. బాత్రూమ్ అంచు గాజుతో తయారు చేయబడింది. అయితే, బాత్రూమ్ నుండి గదులను వేరు చేయడానికి తలుపు లేదు. బాత్రూమ్ చాలా ఆధునికమైనది, వాక్-షవర్, టాయిలెట్ మరియు సింక్.

ఈ చిత్రాన్ని సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారు. ఇంటి ఫోటోను చూసిన తరువాత, ప్రజలు ఇంటిని ప్రశంసిస్తున్నారు. అదే సమయంలో, ప్రజలు కూడా బాత్రూంలో తలుపు చూసి ఆశ్చర్యపోతారు.

ఇవి కూడా చదవండి

Platform Ticket: ప్లాట్‌ఫాం టిక్కెట్‌ ఉంటే మీరు రైలు ప్రయాణం చేయవచ్చు.. ఎలాగో తెలుసా…!

Incredible video shows: గగుర్పాటుకు గురిచేసిన వీడియో.. గాలానికి చిక్కిన చేపను మొసలి ఏం చేసిందో తెలుసా..

Viagra of Himalayas: ప్రపంచంలో అత్యంత ఖరీదైన ‘పురుగు’ శిలీంధ్రం..హిమాలయన్ వయాగ్రాగా పిలిచే దీని ధర ఎంతో తెలుసా..!