- Telugu News Photo Gallery Business photos Holding more than one pan card do this avoid hefty penalty
PAN Card: ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులున్నాయా..? అయితే మీరు చిక్కుల్లో పడినట్లే.. భారీ పెనాల్టీ
PAN Card: ఆర్థిక లావాదేవీలు ప్రత్యేకించి బ్యాంక్ ఖాతా తెరిచేందుకు, వ్యాపార వాణిజ్య కార్యకలాపాల నిర్వహణకు, ఐటీ రిటర్న్ దాఖలు చేయానికి అత్యంత ...
Updated on: Mar 06, 2021 | 10:36 PM

PAN Card: ఆర్థిక లావాదేవీలు ప్రత్యేకించి బ్యాంక్ ఖాతా తెరిచేందుకు, వ్యాపార వాణిజ్య కార్యకలాపాల నిర్వహణకు, ఐటీ రిటర్న్ దాఖలు చేయానికి అత్యంత ముఖ్యమైనది పాన్ కార్డు (పర్మినెంట్ అకౌంట్ నెంబర్). పాన్ డిజిట్ నెంబర్‌ను ఆదాయ పన్ను శాఖ కేటాయిస్తుంది. ఆదాయం పన్ను చెల్లింపుదారుడు పాన్ కార్డ్ కలిగి ఉండటం తప్పనిసరి. అయితే దేశమంతా కొంత మంది ఎక్కువ పాన్ కార్డులు కలిగి ఉండటం బయటపడుతూనే ఉన్నాయి. ఆదాయ పన్ను (ఐటీ) శాఖ నిబంధనల ప్రకారం.. ఏ ఒక్కరూ ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డు కలిగి ఉండరాదు.

పాత పాన్ కార్డుపై క్రెడిట్ స్కోర్ బ్యాడ్‌గా ఉంటే రుణాలు తీసుకోవడం కోసం కొంత మంది ఉద్దేశ పూర్వకంగా ఒకటికంటే ఎక్కువ పాన్‌కార్డుల కోసం దరఖాస్తు చేస్తుంటారు. మరి కొందరు తమ ఆదాయాన్ని విభజించి పన్ను చెల్లింపుల భారాన్ని తగ్గించుకోవడానికి ఒకటికంటే ఎక్కువ పాన్ కార్డులు తీసుకుంటారు. ఇక మరికొన్ని సందర్భాల్లో కొందరు అజాగ్రత్తతో, అనుకోకుండా ఒకటి కంటే ఎక్కువ పాన్‌కార్డులు కలిగి ఉంటారు. ఉదాహరణగా చెప్పాలంటే.. మొదటి పాన్ కార్డు పోగొట్టుకుంటే దాని స్థానంలో డూప్లికేట్ కోసం అభ్యర్థించకుండా కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటుంటారు.

అత్యధిక కేసుల్లో మహిళల వివాహమైన తర్వాత వారింటి పేరు మారుతుంది. ఇటువంటి సందర్భాలలో ఒరిజినల్ కార్డును అప్‌డేట్ చేయడానికి బదులు కొత్తపాన్ కార్డు కోసం మహిళలు దరఖాస్తు చేస్తుంటారు. కానీ ఆదాయ పన్నుశాఖ 272బీ సెక్షన్ ప్రకారం ఎవరైనా రెండు పాన్‌కార్డులు కలిగి ఉంటే రూ.10వేల వరకు జరిమానా విధించాల్సి ఉంటుంది. ఇక పాన్‌కార్డుతో ఆధార్ నెంబర్‌ను అనుసంధానించడం ఇప్పుడు తప్పనిసరి.

దీని వల్ల ఒకటికంటే ఎక్కువ పాన్ కార్డులు ఉన్న సంగతి ప్రభుత్వానికి సులభంగా తెలిసిపోతుంది. కనుక ఒకటికంటే ఎక్కువ పాన్ కార్డులు కలిగి ఉండటంపై ఇప్పుడు ప్రభుత్వాలు తీవ్రంగా పరిగణించి చర్యలు చేపడుతోంది. అందుకే ఎవరి దగ్గరైనా ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు కలిగి ఉన్నట్లయితే దానిని రద్దు చేసుకోవడం బెటర్ అని ఆదాయ పన్ను శాఖ సూచిస్తోంది. లేకపోతే చిక్కుల్లో పడే అవకాశం ఉంది.




