- Telugu News Photo Gallery Business photos Vijetha supermarket now in manikonda inagurated by jupallli ramurao and miss india manasa 2
Vijetha : విజేత సూపర్ మార్కెట్ ఇప్పుడు మణికొండలో.. మైహోమ్ గ్రూప్ డైరెక్టర్ జూపల్లి రామురావు, మిస్ఇండియా మానస చేతులమీదుగా..
womens day 2021, Vijetha Super Market : మణికొండలో భారీ ఎత్తున ఏర్పాటు చేసిన విజేత సూపర్ మార్కెట్ ని మిస్ ఇండియా మానస వారణాసితో కలిసి మైహోమ్ గ్రూప్ డైరెక్టర్ జూపల్లి రామురావు ప్రారంభించారు
Updated on: Mar 06, 2021 | 6:00 PM

Vijetha Super Market : మహానగరంలో వేగంగా విస్తరిస్తోంది విజేత సూపర్ మార్కెట్. ఏడాదిలోగా వంద స్టోర్‌ల మైలేజ్‌ను చేరుకోవాలన్న ఆ సంస్థ లక్ష్యంలో భాగంగా ఇవాళ 70వ స్టోర్ ప్రారంభమైంది.

మణికొండలో భారీ ఎత్తున ఏర్పాటు చేసిన విజేత సూపర్ మార్కెట్ ని మిస్ ఇండియా మానస వారణాసితో కలిసి మైహోమ్ గ్రూప్ డైరెక్టర్ జూపల్లి రామురావు ప్రారంభించారు.

మిస్ ఇండియా మానస వారణాసితో కలిసి మైహోమ్ గ్రూప్ డైరెక్టర్ జూపల్లి రామురావు మణికొండ విజేత సూపర్ మార్కెట్‌ను రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలనగావించి ప్రారంభించారు.

ఈ ఇయర్ 'ఉమెన్స్ డే' తనకు చాలా స్పెషల్ అంటున్న మాసనకు, రామురావు ఈ సందర్భంగా బెస్ట్ విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా రామురావు, మానస.. విజేత సూపర్ మార్కెట్ మరింతగా పరిఢవిల్లాలని ఆకాంక్షించారు.

1999లో విజేత సూపర్ మార్కెట్ మొదటి షోరూం హైదరాబాద్ లోని చందానగర్ లో ప్రారంభించామని సంస్థ అధిపతి జగన్ మోహన్ రావు తెలిపారు. గత 22ఏళ్లుగా వినియోగదారుల ఆదరాభిమానాలు పొందుతూ ముందుకు సాగుతుండటం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా జగన్ మోహన్ రావు వెల్లడించారు.

తమకు పదిశాతం స్ట్రోర్స్ మై హోమ్ కమ్యూనిటీ అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లలో ఉండటానికి అవకాశం కల్పించిన మై హోం గ్రూప్ సభ్యులందరికీ, ముఖ్యంగా మైహోం సంస్థల అధినేత జూపల్లి రామేశ్వరరావుగారికి, డైరెక్టర్ రాము గార్కి మోహన్ రావు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.





























