National Pension System: కేంద్రం అనుమతి.. మీరు ఈ స్కీమ్‌లో డబ్బులు జమ చేస్తున్నారా..? మీకో శుభవార్త

National Pension System: మీరు నేషనల్‌ పెన్షన్‌ (NPS) స్కీమ్‌లో డబ్బులు జమ చేస్తున్నారా..? అయితే మీకో శుభవార్త. పాక్షికంగా డబ్బులు విత్‌డ్రా చేసేందుకు కేంద్ర....

National Pension System: కేంద్రం అనుమతి.. మీరు ఈ స్కీమ్‌లో డబ్బులు జమ చేస్తున్నారా..? మీకో శుభవార్త
Follow us
Subhash Goud

|

Updated on: Mar 07, 2021 | 12:35 AM

National Pension System: మీరు నేషనల్‌ పెన్షన్‌ (NPS) స్కీమ్‌లో డబ్బులు జమ చేస్తున్నారా..? అయితే మీకో శుభవార్త. పాక్షికంగా డబ్బులు విత్‌డ్రా చేసేందుకు కేంద్ర సర్కార్‌ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (PFRDA) విత్‌డ్రా నిబంధనలలో మార్పులు చేసింది. కరోనా వైరస్‌ను కేంద్ర ప్రభుత్వం క్రిటికల్‌ ఇల్‌నెస్‌గా గుర్తించడంతో నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (NPS) ఖాతాదారులు పాక్షికంగా విత్‌డ్రా చేసుకోవచ్చని పీఎఫ్‌ఆర్డీఏ తెలిపింది. మరీ అత్యవసరమైతే తప్ప ఈ స్కీమ్‌ నుంచి డబ్బులు డ్రా చేయడానికి వీలు లేదని పర్సనల్‌ ఫైనాన్స్‌ నిపుణులు సూచిస్తున్నారు.

అయితే ఈ స్కీమ్‌లో డబ్బులు జమ చేస్తున్నట్లయితే డబ్బు సమకూర్చుకోవడానికి ఇతర మార్గాలు లేకపోతే ఎన్‌పీఎస్‌ నుంచి డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఎన్‌పీఎస్‌ వినియోగదారులు ఈ పథకంలో చేరిన మూడేళ్ల తర్వాత పాక్షికంగా డబ్బులు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. జమ చేసిన మొత్తంలో 25 శాతానికి మించి విత్‌డ్రా చేయడం సాధ్యం కాదు. అంటే మూడు సంవత్సరాల్లో రూ.3,00,000 జమ చేస్తే అందులో రూ.75,000 మాత్రమే విత్‌ డ్రా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక ఎన్‌పీఎస్‌ ఖాతా వాడుతున్న కాలంలో గరిష్ఠంగా మూడు సార్లు మాత్రమే పాక్షికంగా విత్‌డ్రా చేయవచ్చు. కొత్త నిబంధనల ప్రకారం.. పాక్షికంగా విత్‌డ్రా చేసే మొత్తానికి పన్నులు ఉండవు. పిల్లల పై చదువులు, వివాహాలు, కొత్త ఇల్లు కొనేందుకు, ఇల్లు కట్టుకునేందుకు తీవ్రమైన అనారోగ్యాలకు చికిత్స కోసం నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ స్కీమ్‌ నుంచి పాక్షికంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. కేంద్ర సర్కార్‌ నిర్వహిస్తున్న పొదుపు పథకాల్లో నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ ఎంతో పేరొందింది. ఆర్థిక సంవత్సరంలో రూ.1,50,000 వరకు జమ చేస్తే పన్ను మినహాయింపు వస్తుంది. అదనంగా రూ.50,000 వరకు ఉపయోగంగా ఉంటాయి.

ఇందులో మొదట కనీసం రూ.500 జమ చేయాలి. ఆ తర్వాత ఏడాదికి కనీసం రూ.1000 చొప్పున జమ చేయాలి. ప్రైవేటు ఉద్యోగులు తమ రిటైర్మెంట్‌ ప్లానింగ్‌లో భాగంగా ఈ స్కీమ్‌లో డబ్బులు జమ చేయవచ్చు. ఇందులో 60 ఏళ్ల వయసు వచ్చే వరకు డబ్బులు జమ చేయవచ్చు. అలాగే పెన్షన్‌ స్కీమ్‌లో జమ చేసిన మొత్తంలో 60 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. మిగిలిన 40 శాతం నుంచి ప్రతీ నెలా పెన్షన్‌ వస్తుంది. ఈ పెన్షన్‌ రూ.15,000పైనే ఉంటుంది. అయితే చివరిలో విత్‌డ్రా సమయంలో వచ్చే మొత్తం, ప్రతినెల లభించే పెన్షన్‌ ఇప్పుడు మీరు జమ చేసేదాన్ని బట్టి మారుతుంది.

ఇవీ చదవండి :

Mukesh Ambani: అంబానీ గ్యారేజ్‌లో కొత్త కారు.. 100 కిలోమీటర్ల వేగాన్ని 4.5 సెకన్లలోనే అందుకుంటుంది.. ధర ఎంతంటే..!

PAN Card: ఒకటి కంటే ఎక్కువ పాన్‌ కార్డులున్నాయా..? అయితే మీరు చిక్కుల్లో పడినట్లే.. భారీ పెనాల్టీ