Mukesh Ambani: అంబానీ గ్యారేజ్‌లో కొత్త కారు.. 100 కిలోమీటర్ల వేగాన్ని 4.5 సెకన్లలోనే అందుకుంటుంది.. ధర ఎంతంటే..!

Mukesh Ambani:  ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్‌ అధినేత ముకేష్‌ అంబానీ కార్ల గ్యారేజీలో కొత్త కార్లు వచ్చి చేరాయి. 2021 ఆరంభంలోనే మూడు అత్యంత విలాసవంతమైన ..

Mukesh Ambani: అంబానీ గ్యారేజ్‌లో కొత్త కారు.. 100 కిలోమీటర్ల వేగాన్ని 4.5 సెకన్లలోనే అందుకుంటుంది.. ధర ఎంతంటే..!
Follow us
Subhash Goud

|

Updated on: Mar 07, 2021 | 12:06 AM

Mukesh Ambani:  ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్‌ అధినేత ముకేష్‌ అంబానీ కార్ల గ్యారేజీలో కొత్త కార్లు వచ్చి చేరాయి. 2021 ఆరంభంలోనే మూడు అత్యంత విలాసవంతమైన ఎస్‌యూవీలు డెలివరీ అయ్యాయి. తాజాగా భారత్‌లో అత్యంత ఖరీదైన కారు రోల్స్‌ రాయిస్‌ కల్లినన్‌ బ్లాక్‌ బ్యాడ్జ్‌ కూడా అంబానీ కార్లలో ఒకటైపోయింది. విలాసంతో పాటు అత్యంత భద్రత ఈ కారుకున్న ప్రత్యేకత. 2018లో భారత్‌కు తీసుకువచ్చిన రోల్స్‌ రాయిస్‌ కల్లినన్‌కు మరిన్ని ఆధునాతనమైన, టెక్నాలజీతో కూడిన కల్లినన్‌ బ్లాక్‌ బ్యాడ్జ్‌గా తీసుకువచ్చారు. దీనిని 2020లో విడుదల చేశారు. రెండు కల్లినన్‌ మోడళ్లను సొంతం చేసుకున్న తొలి భారతీయుడు ముకేష్‌ అంబానీ అని తెలుస్తోంది. బ్లాక్ బ్యాడ్జ్ ఎడిషన్ ధర రూ.8.20 కోట్లుగా (ఎక్స్‌ షోరూం) ఉంది. ఇక దీన్ని రోడ్డు పైకి తీసుకురావాలంటే మొత్తం రూ.10 కోట్ల పైగానే ఖర్చు చేయాల్సి వస్తుందని సమాచారం. ఇక కలర్‌, ఇంటీరియర్స్‌ మన అభిరుచులకు అనుగుణంగా తీర్చిదిద్దాలంటే మరింత ఖర్చు పెట్టుకోవాల్సిందే. సాధారణంగా ముకేశ్‌ అంబానీ ఆయన కార్లలో చాలా మార్పులు చేయించుకుంటుంటారు.

ఈ కారు ఫీచర్స్‌ :

కాగా, ఈ కారు ఫీచర్స్‌ గురించి పరిశీలిస్తే.. 6.75 లీటర్ సామర్థ్యం ఉన్న ట్విన్-టర్బో వీ12 ఇంజన్ తో ఉంటుంది. బేసిక్‌ కల్లినన్‌తో పోల్చితే ఈ కారు మరింత శక్తిమంతమైంది. గరిష్ఠంగా 592 హెచ్‌పీ శక్తిని, 900 ఎన్‌ఎమ్‌ టార్క్‌ని విడుదల చేస్తుంది. ఈ కారు 8 స్పీడ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌తో ఉంటుంది. అంతేకాదు.. ఈ కారు గంటకు 100 కి.మీ వేగాన్ని 4.5 సెకన్లలోనే అందుకుంటుంది. ఎడారి, అడవి, బురద, కొండ ప్రాంతం ఇలా ఎలాంటి ప్రాంతంలోనైనా దూసుకుపోయేలా దీనిని తయారు చేశారు. ఇక కారు ఇంటిరియర్స్‌లోని పైభాగాన్ని నక్షత్రాల్ని తలపించే ప్రత్యేక డిజైనింగ్‌ ఆకట్టుకుంటుంది.

బ్లాక్‌బ్యాడ్జ్‌తో పాటు రోల్స్‌ రాయిస్‌కు చెందిన ఫాంటమ్‌ VIII, ఫాంటమ్‌ డీహెచ్‌సీ వంటి అత్యంత విలాసవంతమైన, ఖరీదైన కార్లు అంబానీ గ్యారేజ్‌లో ఉన్నాయి. వీటితో పాటు బెంట్లీ బెంటెగా, మసెరటి లెవంటి కార్లు కూడా ఈ ఏడాదే అంబానీ ఇంట్లో చేరాయి. వీటన్నింటినీ ఆయన 2020లో ఆర్డర్‌ చేయగా.. ఇప్పుడు డెలివరీ అయినట్లు సమాచారం. ఈ కారుకు అన్ని ప్రత్యేకతలే. ఇక వీటితో పాటు బీఎండబ్ల్యూ ఐ8, ఫెరారీ 812, మెక్‌లారెన్‌ 520ఎస్‌ స్పైడర్‌, లాంబోర్గినీ అవెంటడర్‌ ఎస్‌ రోడ్‌స్టర్‌, ఫెరారీ 488 జీటీబీ, ఫెరారీ పోర్టోఫినో, యాస్టన్‌ మార్టిన్‌ డీబీ11 వంటి సూపర్‌ కార్లు ముకేశ్‌ అంబానీ కుటుంబం వాడే కార్లలో కొన్ని ఉన్నాయి.

ఇవీ చదవండి :

PAN Card: ఒకటి కంటే ఎక్కువ పాన్‌ కార్డులున్నాయా..? అయితే మీరు చిక్కుల్లో పడినట్లే.. భారీ పెనాల్టీ

మరోసారి అస్వస్థతకు గురైన ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్.. ప్రత్యేక విమానంలో ముంబై ఆస్పత్రికి తరలింపు