మరోసారి అస్వస్థతకు గురైన ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్.. ప్రత్యేక విమానంలో ముంబై ఆస్పత్రికి తరలింపు

భోపాల్ పార్లమెంటు సభ్యులు, బీజేపీ నేత ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఆమెను చికిత్స నిమిత్తం ముంబైకి తరలించారు.

  • Balaraju Goud
  • Publish Date - 7:16 pm, Sat, 6 March 21
మరోసారి అస్వస్థతకు గురైన ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్.. ప్రత్యేక విమానంలో ముంబై ఆస్పత్రికి తరలింపు

MP Pragya singh thakur gets ill again : భోపాల్ పార్లమెంటు సభ్యులు, బీజేపీ నేత ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధిత సమస్యతో ఇబ్బందిపడుతుండటంతో ఆమెను చికిత్స నిమిత్తం ముంబైకి తరలించారు. ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఆమె సహాయకులు సమాచారం ఇవ్వడంతో ప్రత్యేక మెరుగై చికిత్స కోసం ప్రత్యేక విమానంలో ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రికి తరలించినట్లు ఆమె కార్యాలయం శనివారం తెలిపింది. ప్రస్తుతం ఆమెను వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.

ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా ఇటీవల వరుసగా అనారోగ్యానికి గురవుతూ వస్తున్నారు. ఆమె ఆసుపత్రిలో చేరడం ఇది ఒక నెలలోపు రెండవసారి. ఫిబ్రవరి 19 న ఇలాంటి సమస్యలతో ఆమెను న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) కు తీసుకెళ్లారు. తాజాగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో హుటాహుటీన ముంబై ఆస్పత్రికి తరలించారు. 2020 డిసెంబర్ నెలలో కోవిడ్ లక్షణాలతో ఆమె ఎయిమ్స్‌లో చేరిన సంగతి తెలిసిందే.


ఇదిలావుంటే, 2008 మాలెగావ్ పేలుళ్ళ కేసులో ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ నిందితురాలు. ఆమెకు 2017లో బెయిలు మంజూరైంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆమె మధ్య ప్రదేశ్‌లోని భోపాల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్‌ను ఓడించారు. ఆయనపై 3.6 లక్షల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.

అంతేకాదు, ఆమె వివాదాస్పద ప్రసంగాలకు పేరుగాంచిన ప్రజ్ఞా సింగ్ ఠాకూర్.. మహాత్మా గాంధీని చంపిన హంతకుడు నాథురామ్ గాడ్సే దేశభక్తుడు అని వివాదాస్పద ప్రకటన కూడా చేశారు.

Read Also..  వ్యవసాయ చట్టాలు: ప్రపంచవ్యాప్తంగా వినిపించిన రైతు గళం.. అన్నదాతకు అండగా నిలుస్తున్న అతివలు