AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుశాంత్ సింగ్ కేసులో ఎన్సీబీ ఛార్జ్ షీట్ ‘శుధ్ధ వేస్ట్’, పెదవి విరిచిన రియా లాయర్

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి సంబంధించి డ్రగ్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) తన క్లయింటు రియా చక్రవర్తి సహా ఇతరులపై రూపొందించిన ఛార్జ్ షీట్ పట్ల ఆమె తరఫు లాయర్ సతీష్ మాన్ షిండే..శుధ్ద వృధా అన్న టైపులో వ్యాఖ్యానించారు.

సుశాంత్ సింగ్ కేసులో ఎన్సీబీ ఛార్జ్ షీట్ 'శుధ్ధ వేస్ట్',  పెదవి విరిచిన రియా లాయర్
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: Mar 06, 2021 | 7:44 PM

Share

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి సంబంధించి డ్రగ్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) తన క్లయింటు రియా చక్రవర్తి సహా ఇతరులపై రూపొందించిన ఛార్జ్ షీట్ పట్ల ఆమె తరఫు లాయర్ సతీష్ మాన్ షిండే..శుధ్ద వృధా అన్న టైపులో వ్యాఖ్యానించారు. ఈ చార్జ్ షీట్ పట్ల పూర్తి అసంతృప్తిని ప్రకటించారు. రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి సహా 33 మంది నిందితులమీద 11,700 పేజీల ఛార్జ్ షీట్ తయారు చేశారని , కానీ ఇదంతా తన క్లయింటును ఏదోవిధంగా ఈ కేసులో ఇరికించాలన్నదే ఈ ఛార్జ్ షీట్ లక్ష్యంగా ఉందని ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆరోపించారు. కేవలం ఒకే ఒక వ్యక్తిపైనే అధికారులు తమ దృష్టి అంతా కేంద్రీకరించారని ఆయన విమర్శించారు.

ఈ కేసులో 33 మంది నిందితులనుంచి స్వాధీనం చేసుకున్నామని చెబుతున్న నార్కోటిక్స్ పదార్థాలన్నీ ముంబై శాఖ లోని ఓ కానిస్టేబుల్. లేదా నార్కోటిక్స్  సెల్, లేక ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ విభాగం నుంచో, లేదా ఇతర ఏజెన్సీల నుంచో స్వాధీనం చేసుకున్నవాటితో పోలిస్తే అసలు ఇది ఎంత అని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్సీబీలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు బాలీవుడ్ లో డ్రగ్ యాంగిల్ పై ఫోకస్ పెట్టారని, అయితే ఇన్వెస్టిగేషన్ సందర్భంగా పరేడ్ చేసిన వ్యక్తుల నుంచి ఏదైనా స్వాధీనం చేసుకున్నారా అని సతీష్ ప్రశ్నించారు. తూఫాన్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇఛ్చిన తీర్పు తరువాత నార్కోటిక్స్ కంట్రోల్ విభాగ చట్టం 67 సెక్షన్ కింద రికార్డు చేసిన నిరాధారమైన వాంగ్మూలాల నేపథ్యంలో ఈ ఛార్జ్ షీట్ వృధా అన్నారాయన.. అసలు రియా చక్రవర్తిపై ఆరోపణలు లేకపోతే ఈ కేసుకు సబ్ స్టెన్స్ అన్నదే లేదు అని ఆయన పేర్కొన్నారు.  బాలీవుడ్ లో డ్రగ్ కేసును ఎన్సీబీ పూర్తిగా దర్యాప్తు చేస్తోందని, ఇక పెద్ద దిగ్గజాల బాగోతాలు బయటపడతాయని లోగడ పతాక శీర్షికలతో వార్తలు వచ్చాయి. కానీ బాలీవుడ్ ని శాసిస్తున్న పెద్దల ముందు ఎన్సీబీ దాదాపు తోక ముడిచిందని  అంటున్నారు.  పట్టుబడిన నిందితులంతా ఒక్కొకరుగా కోర్టుల్లో బెయిల్ పొంది బయటపడ్డారు.

మరిన్ని ఇక్కడ చదవండి:

హాంకాంగ్ ఎన్నికల వ్యవస్థపై చైనా పెత్తనం ! ఆగ్రహించిన అమెరికా, సహించబోమని వార్నింగ్

Bumrah Marriage News: బుమ్రా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఆమేనట.? నెట్టింట మరో పుకారు.!! అసలు నిజమేది.!