హాంకాంగ్ ఎన్నికల వ్యవస్థపై చైనా పెత్తనం ! ఆగ్రహించిన అమెరికా, సహించబోమని వార్నింగ్

హాంకాంగ్ ఎన్నికల వ్యవస్థను  మారుస్తామంటూ, సంస్కరణలను ప్రవేశపెడతామంటూ చైనా చేసిన హెచ్చరికలపై అమెరికా మండిపడింది. ఇది హాంకాంగ్ స్వయం ప్రతిపత్తిపైన, ప్రజాస్వామ్య వ్యవస్థలపైనా దాడి చేయడమేనని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ ఖండించారు.

  • Umakanth Rao
  • Publish Date - 7:35 pm, Sat, 6 March 21
హాంకాంగ్ ఎన్నికల వ్యవస్థపై చైనా పెత్తనం ! ఆగ్రహించిన అమెరికా, సహించబోమని వార్నింగ్

హాంకాంగ్ ఎన్నికల వ్యవస్థను  మారుస్తామంటూ, సంస్కరణలను ప్రవేశపెడతామంటూ చైనా చేసిన హెచ్చరికలపై అమెరికా మండిపడింది. ఇది హాంకాంగ్ స్వయం ప్రతిపత్తిపైన, ప్రజాస్వామ్య వ్యవస్థలపైనా దాడి చేయడమేనని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ ఖండించారు. ఈ వైఖరిని సహించబోమన్నారు. తమ ప్రభుత్వంపై హాంకాంగ్ వాసుల గళాన్ని చైనా తమకు అనువుగా మార్చే యత్నంలో భాగంగానే ఆ దేశం ఈ అనుచిత ధోరణికి, పెత్తనానికి దిగుతోందని ఆయన అన్నారు.సరిగా ఏడాదైనా కాకుండానే హాంకాంగ్ పై  చైనా జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించింది. ఆ దేశ  పార్లమెంట్ ఆమోదించిన ఈ  చట్టం కింద తమ దేశాన్ని వ్యతిరేకించే హాంకాంగ్ వాసులనెవరినైనా చైనా పోలీసులు అరెస్టు చేయవచ్చు.. చైనాకు వ్యతిరేకంగా జరిగే ప్రదర్శనలను ఉక్కు పాదంతో అణచివేయవచ్చు.. ఇలాగే హాంకాంగ్ ప్రతిపత్తిని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోవడానికి ఈ చట్టం చైనాకు వీలు కల్పిస్తోంది. అయితే ఇటీవలే హాంకాంగ్ ఎన్నికల వ్యవస్థను కూడా తనకు అనుకూలంగా మార్చుకునేందుకు సైతం సంస్కరణల పేరిట లెజిస్లేటివ్ ప్రాసెస్ ని ప్రారంభించింది.

ఇలా చైనా పీపుల్స్ రిపబ్లిక్ ఒక్కొక్కటిగా హాంకాంగ్ మీద పూర్తి పట్టు సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాలను తాము  గర్హిస్తున్నామని, ఈ  విషయంలో ఇక సహించే ప్రసక్తి లేదని నెడ్ ప్రైస్ అన్నారు. మేం నేరుగా నిరసన ప్రకటిస్తున్నాం.. ఈ ఆలోచన మానుకోండి.. అన్నారు. గతంలో కూడా అమెరికా ఇలా పలుమార్లు డ్రాగన్ కంట్రీకి వార్నింగ్ ఇచ్చింది. లోగడ అమెరికా అధ్యక్షునిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ సైతం..తమకు, చైనాకు మధ్య ఉన్న  ట్రేడ్ వార్ ను గుర్తు చేస్తూ ఆ దేశానికి పలు హెచ్చరికలు చేశారు. ప్రస్తుత అధ్యక్షుడు జోబైడెన్ కూడా పరోక్షంగా చైనా పట్ల విముఖత వ్యక్తపరుస్తున్నారు. యూఎస్-చైనా పాలసీని తాము సమీక్షించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. ఇండియా వంటి భాగస్వామ్య దేశాలతో వ్యూహాన్ని పటిష్ఠపరచుకుంటూనే.. ఈ అంశానికి కూడా తాము ప్రాధాన్యమిస్తామని ఆయన చెప్పారు. తాజాగా హాంకాంగ్ విషయంలో చైనా తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఆయన సమీక్షించవచ్చు.

 

మరిన్ని ఇక్కడ చదవండి:

Bumrah Marriage News: బుమ్రా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఆమేనట.? నెట్టింట మరో పుకారు.!! అసలు నిజమేది.!

Elephant Video Viral: గురకబెట్టి నిద్రపోయిన పిల్ల ఏనుగు.. టెన్షన్‌ పడ్డ తల్లి ఏనుగు.. అసలక్కడ ఏం జరిగిందంటే..