Elephant Video Viral: గురకబెట్టి నిద్రపోయిన పిల్ల ఏనుగు.. టెన్షన్‌ పడ్డ తల్లి ఏనుగు.. అసలక్కడ ఏం జరిగిందంటే..

Viral Video: తల్లి ప్రేమకు సాటి మరేదీలేదు.. ఉండదు.. ఈ విషయం ఎన్నోసార్లు, ఎన్నో సందర్భాల్లో రుజువైంది. ఇక తల్లి ప్రేమ మనుషులకే..

Elephant Video Viral: గురకబెట్టి నిద్రపోయిన పిల్ల ఏనుగు.. టెన్షన్‌ పడ్డ తల్లి ఏనుగు.. అసలక్కడ ఏం జరిగిందంటే..
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 06, 2021 | 7:28 PM

Viral Video: తల్లి ప్రేమకు సాటి మరేదీలేదు.. ఉండదు.. ఈ విషయం ఎన్నోసార్లు, ఎన్నో సందర్భాల్లో రుజువైంది. ఇక తల్లి ప్రేమ మనుషులకే పరిమితం కాదు.. సమస్త జీవకోటికీ ఇది వర్తిస్తుంది. మనిషైనా, జంతువైనా, పక్షి అయినా.. మరేదైనా తల్లి ప్రేమలో ఏమాత్రం మార్పు ఉండదు. తాజాగా దీనిని కల్లకు గట్టే ఘటన పరాగ్వే దేశంలోని ఓ ‘జూ’ లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. పరాగ్వే దేశంలోని ఓ ‘జూ’లో ఏనుగు పిల్లకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పిల్ల ఏనుగు ఎంతసేపటికీ నిద్ర లేవకపోవడంతో.. తల్లి ఏనుగు తీవ్ర ఆందోళన చెందింది. వెంటనే జూ సిబ్బందిని సమీపించి వారిని తన బిడ్డ దగ్గరకు తీసుకొచ్చింది. వారు ఆ పిల్ల ఏనుగును పరిశీలించి నిద్రలేపారు. ఇక తీరిగ్గా నిద్రలేచిన పిల్ల ఏనుగు.. తల్లిని చూసి పరిగెత్తుకుంటూ దాని దగ్గరికి వెళ్లింది. దాంతో ఆ తల్లి ఏనుగు కుదిటపడింది. తొండంతో పిల్ల ఏనుగును ప్రేమతో దగ్గరకు తీసుకుంది.

కాగా, దీనికి సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ రమేశ్‌ పాండే ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అసలు విషయం ఏంటేంటే ఆ పిల్ల ఏనుగు రోజంతా ఆడుకొని అలసిపోయి.. అలా సోయి లేకుండా నిద్రపోయిందట. అలా ఎంతసేపటికీ అది నిద్ర లేవలేదు. దీంతో తన బిడ్డకు ఏమైందోనని ఆ తల్లి ఏనుగు చాలా టెన్షన్‌ పడుతూ.. తన బిడ్డను లేపేందుకు ప్రయత్నించింది. తల్లి ఏనుగు దాని తొండంతో తట్టినప్పటికీ పిల్ల ఏనుగు కదలకుండా నిద్రపోతూనే ఉంది. దీంతో ఆ తల్లి ఏనుగు జూ సిబ్బందిని అక్కడికి తీసుకువచ్చింది. ఎట్టకేలకు వాళ్లు చిన్న ఏనుగును నిద్రలేపడంతో ఎప్పటిలాగే జూలో సందడి చేసింది.

Elephant Viral Video:

Also read:

Big Scam in Hyderabad: రాజధానిలో భారీ కుంభకోణం.. ఏకంగా 10 లక్షల మందికి కుచ్చు టోపీ..రూ.1500 కోట్లు లూఠీ

ఈ పంట వేస్తే.. సిరుల పంట.. 1 ఎకరంలో సాగు చేస్తే 30 కోట్లు… సాగు విధానం సహా పూర్తి వివరాలు