Breaking News: కారు బాంబుతో దద్దరిల్లిన సోమాలియా.. ఇరవై మంది దుర్మరణం.. అల్‌ఖైదా దుష్కృత్యం

సోమాలియా దేశ రాజధాని కారు బాంబు పేలుడుతో దద్దరిల్లింది. ఓ రెస్టారెంటులోకి బాంబులతో నింపిన కారును తోలించి బ్లాస్ట్ చేశారు. ఈ పేలుడులో 20 మంది దుర్మరణం పాలయ్యారు. సమీప ప్రాంతాలన్నీ బాంబు పేలుడు...

Breaking News: కారు బాంబుతో దద్దరిల్లిన సోమాలియా.. ఇరవై మంది దుర్మరణం.. అల్‌ఖైదా దుష్కృత్యం
Follow us
Rajesh Sharma

|

Updated on: Mar 06, 2021 | 7:20 PM

Car bomb blast kills twenty in Somalia: సోమాలియా దేశ రాజధాని కారు బాంబు పేలుడుతో దద్దరిల్లింది. ఓ రెస్టారెంటులోకి బాంబులతో నింపిన కారును తోలించి బ్లాస్ట్ చేశారు. ఈ పేలుడులో 20 మంది దుర్మరణం పాలయ్యారు. సమీప ప్రాంతాలన్నీ బాంబు పేలుడు తాకిడికి కంపించిపోయాయి. పేలుడు వెనుక అల్ ఖైదా తీవ్రవాద సంస్థ కుట్ర వుందని ప్రాథమిక సమాచారం అందుతోంది.

సోమాలియా రాజధాని మోగదిషులో శనివారం (మార్చి 6న) మధ్యాహ్నం బాంబు దాడి చోటు చేసుకుంది. ఈ ఘటనలో 20 మంది మృతి చెందారు. ఓ రెస్టారెంట్‌లోకి బాంబుతో కూడిన వాహనం దూసుకెళ్లి పేలిపోయింది. దీంతో హోటల్‌తోపాటు సమీప ఇళ్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. సుమారు 30 మందికి గాయాలు కాగా వారిని లోకల్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాంబు దాడి వెనుక అల్‌-షహబ్‌ సంస్థ హస్తం ఉందని సోమాలియా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అల్‌-షహబ్‌ సంస్థ గత రెండు దశాబ్ధాలుగా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దారుణాలకు, పేలుళ్ళకు, హత్యాకాండలకు పాల్పడిన అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నట్లు గుర్తించారు. సోమాలియా దేశంలో జరగాల్సిన ఎన్నికలపై ప్రతిపక్ష కూటమి శనివారం మొగాదీషులో సమావేశం కావల్సి ఉండగా బాంబు పేలుడు ఘటనతో ఆ సమావేశాన్ని వాయిదా వేశారు. ఈ దారుణ ఉదంతం త్వరలో జరగనున్న ఎన్నికలపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. సోమాలియాలో తాజాగా సంభవించిన కారు బాంబు పేలుడు దుర్ఘటనను పలు దేశాలు ఖండించాయి. ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడుతుందని భావిస్తున్న తరుణంలో ఉగ్రవాద సంస్థలు డిస్టర్బ్ చేేసేందుకు ప్రయత్నించడాన్ని పలు దేశాలు అభ్యంతర పెట్టాయి.

ALSO READ: ఉత్పాతానికి కారణాలు కనుగొన్న శాస్త్రవేత్తలు.. అవి విరిగి పడడం వల్లే ఉధృతి పెరిగింది

ALSO READ: ఏకంగా 10 లక్షల మందికి కుచ్చు టోపీ..రూ.1500 కోట్లు లూఠీ

ALSO READ: రాజకీయ పార్టీలను కుదిపేస్తున్న సెక్స్ స్కాండల్స్.. కన్నడ నాట మరీ అధికం.. అమెరికాలోను అంతే!

ALSO READ: చిన్నమ్మ రాజకీయ సన్యాసం వెనుక ‘ఆ’ ఇద్దరు దూతలు