AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttarakhand Tragedy: ఉత్పాతానికి కారణాలు కనుగొన్న శాస్త్రవేత్తలు.. అవి విరిగి పడడం వల్లే ఉధృతి పెరిగింది

మొన్నటి ఉత్తరాఖండ్ ఉత్పాతానికి కారణాలను కనుగొన్నారు భౌగోళిక శాస్త్రవేత్తలు. ఫిబ్రవరి 7న ఉన్నట్లుండి సంభవించిన జల విలయంతో వందలాది మంది మరణించారు. ఎందరో జాడ లేకుండా పోయారు. జాడలేని వారిలో చాలా మంది మరణించి వుంటారని భావిస్తున్నారు. తాజాగా ఈ ఉత్పాతానికి కారణమేంటో కనుగొన్నారు.

Uttarakhand Tragedy: ఉత్పాతానికి కారణాలు కనుగొన్న శాస్త్రవేత్తలు.. అవి విరిగి పడడం వల్లే ఉధృతి పెరిగింది
Rajesh Sharma
|

Updated on: Mar 06, 2021 | 6:49 PM

Share

Reason behind Uttarakhand tragedy: ఇటీవల ఉత్తరాఖండ్‌లో సంభవించిన జలవిలయాన్ని కొన్నేళ్ళ వరకు ఎవరూ మరచిపోలేరు. ఒక్కసారిగా, అనూహ్యంగా వచ్చిన జల విలయానికి వందలాది మంది బురదల్లో కూరుకుపోయారు. విలయం ప్రభావం ఎంతలా వుందంటే.. సుమారు 1500 మంది మిస్సయ్యారని రిపోర్టులు వస్తే వంద మృతదేహాలను కూడా వెలికి తీయలేని పరిస్థితి కనిపించింది. బురద ఎండి కుప్పలుగా మారిపోగా.. వాటి కింద విగతజీవులైన వారిని తవ్వి తీయలేనంతటి ప్రళయం సంభవించింది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో.

ఉత్తరాఖండ్‌లో సంభవించిన జలవిలయం పెద్ద స్థాయిలో ప్రాణ, ఆస్తినష్టాన్ని తెచ్చిపెట్టింది. ధౌలీగంగా, రిషిగంగా, అలకనందా నదులు ఉప్పొంగడంతో సమీపంలోని ఇళ్లు, ఆనకట్టలు, విద్యుత్ కేంద్రాలు వరద నీటితో తుడిచి పెట్టుకుపోయాయి. ఈ ఘటనలో సుమారు 70 మంది మరణించారని తేల్చినా మరణించిన వారి సంఖ్య వందల్లో వుంటుందని పలువురు భావిస్తున్నారు. 125 మంది జాడ ఇంకా దొరకలేదు. అయితే ఈ జల ప్రళయానికి భారీ కొండచరియలే కారణమని శాస్త్రవేత్తలు తేల్చారు. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెయిన్ డెవలప్‌మెంట్‌(ఐసీఐఎమ్‌ఓడీ)కి చెందిన అధికారులు శాస్త్రీయంగా కనుగొన్న విషయాలను ప్రకటించారు. దీనికి సంబంధించిన నివేదికను కొన్ని మీడియా సంస్థలు తాజాగా ప్రచురించింది.

‘‘మంచుతో కలగలిసిన 22 మిలియన్‌ క్యూబిక్ మీటర్ల రాతి చరియలు ఉత్తరాఖండ్ విలయానికి కారణమయ్యాయి. గతంలో ఈ తరహా ఘటనల ద్వారా పేరుకుపోయిన శిథిలాలు, మంచు నీటిని ముందుకు తోసి, ప్రవాహ ఉద్ధృతికి దోహదం చేశాయి’’ అని ఐసీఐఎంఓడీ తన రిపోర్టులో పేర్కొన్నారు. ఈ వరద ప్రవాహానికి ఆనకట్టలు కూడా ధ్వంసమయ్యాయి. ఛమోలీ జిల్లాలోని 13 గ్రామాల ప్రజల రాకపోకలకు వీలుగా నిర్మించిన బెయిలే బ్రిడ్జి కూడా వరద ఉధృతిలో పూర్తిగా కొట్టుకుపోయింది. తుడిచి పెట్టుకుపోయింది. దాంతో ఆ గ్రామాల ప్రజలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. వెంటనే రంగంలోని దిగిన ప్రభుత్వం ఫిబ్రవరి 25న మరలా ఆ బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రారంభించారు. మార్చి 20కల్లా దాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. అయితే పెట్టుకున్న గడువు కంటే ముందే బోర్డర్స్‌ రోడ్ ఆర్గనైజేషన్(బీఆర్‌ఓ) నిర్మాణాన్ని పూర్తి చేసింది. దాంతో ట్రయల్స్ ముగించుకొని బెయిలే బ్రిడ్జి శుక్రవారం (మార్చి 5న) ప్రజా రవాణాకు వినియోగానికి వచ్చింది.

2013లో వచ్చిన కేదార్‌నాథ్ పెను ఉప్పెన తర్వాత తాజాగా సంభవించిన ఉత్పాతం పలువురు ప్రాణాలను హరించింది. గ్లేసియర్ విరిగి పొంగి రాగా.. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని తపోవన్, రేని ప్రాంతాల్లో హైడల్ ప్రాజెక్టు కొట్టుకుపోయింది. ఇళ్ళు, వంతెనలు కొట్టుకుపోయాయి. నిజానికి ఉత్తరాఖండ్ రాష్ట్రంమంతగా విస్తరించి వున్న కొండ ప్రాంతాల్లో జనజీవనం ఎప్పుడు దుర్బరమే. ఎప్పుడు ఏ కొండ చెరియ విరిగిపడి ఎలాంటి ప్రాణనష్టం సంభవిస్తుందో తెలియని పరిస్థితి. హిమాలయాలకు దక్షిణ భాగంలో వున్న ఉత్తరాఖండ్‌కు కరుగుతున్న మంచు ఓ శాపమనే చెప్పాలి. ఉత్తరాఖండ్‌ భౌగోళిక పరిస్థితుల కారణంగా చూస్తే.. సడణ్ వరదలకు, హిమ ఉత్పాతాలకు, కొండచెరియల విరిగిపడే ఉదంతాలకు, భూకంపాలు తరచూ వస్తుంటాయి. ప్రాణ, ఆస్తి నష్టాలకు దారి తీస్తుంటాయి. రహదారులపై అనుకోకుండా విరుచుకు పడే కొండచెరియల కారణంగా రోజుల తరబడి వాహనాలు, ప్రయాణీకులు రోడ్ల మీద గడపాల్సిన పరిస్థితులను ఇదివరకు చాలా చూసింది ఉత్తరాఖండ్. తరచూ ప్రకృతి ప్రకోపాలకు గురయ్యే ఉత్తరాఖండ్‌ రాష్ట్రాన్ని, అక్కడ ప్రజలను.. మరీ ముఖ్యంగా హిందువులు అత్యంత పవిత్రంగా భావించే ఛార్‌ధామ్ పుణ్యక్షేత్రాలను రక్కించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సి వుందనేది తాజా ఉత్పాతం గుర్తు చేసింది.

ALSO READ: ఏకంగా 10 లక్షల మందికి కుచ్చు టోపీ..రూ.1500 కోట్లు లూఠీ

ALSO READ: రాజకీయ పార్టీలను కుదిపేస్తున్న సెక్స్ స్కాండల్స్.. కన్నడ నాట మరీ అధికం.. అమెరికాలోను అంతే!

ALSO READ: చిన్నమ్మ రాజకీయ సన్యాసం వెనుక ‘ఆ’ ఇద్దరు దూతలు

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ