AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు.. పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటుందని అవమానించారు

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి చాలా వార్తలు వచ్చాయి. చాలా మంది హీరోయిన్స్ తాము ఎదుర్కున్న చేదు అనుభవాలను మీడియా ముందు దైర్యంగా బయట పెట్టారు. అలాగే దర్శకుల గురించి , నిర్మాతల గురించి కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు.

నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు.. పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటుందని అవమానించారు
Actress
Rajeev Rayala
|

Updated on: Dec 06, 2025 | 5:33 PM

Share

నటిగా చాలా సినిమాల్లో చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అందాల భామ. హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆమె ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసి మెప్పించింది. ఎక్కవగా ఆమె బోల్డ్ క్యారెక్టర్స్ చేసి ఆకట్టుకుంది. చాలా సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లోనూ మెరిశారు ఈ అందాల తార.. తెలుగమ్మాయి అయినా కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్ గా 30కి పైగా సినిమాల్లో నటించింది రమ్యశ్రీ. తెలుగులో ఎన్నో సినిమాల్లో మెప్పించింది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ, మళయాల, హిందీ, భోజ్ పురి భాషలలో 250 చిత్రాలలో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

ఇది కూడా చదవండి : అమ్మబాబోయ్..! నాగ చైతన్య హీరోయిన్ ఎంత మారిపోయింది.. సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..

ఆమె అసలు పేరు సుజాత.. సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత చాలా మంది అదే పేరుతో ఉండటంతో రమ్యశ్రీగా పేరు మార్చుకుంది. సినీ నటి రమ్య శ్రీ గుర్తుందా..? ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది ఆమె.. ఎక్కువగా బోల్డ్ సీన్స్ లో నటించి ఆకట్టుకుంది. తెలుగు అమ్మాయి అయిన రమ్యశ్రీ కన్నడ ఇండస్ట్రీలో మొదటిగా నటించింది. రమ్యశ్రీ ఎక్కువగా శృంగార రస పాత్రలను పోషిస్తుంటుంది. నువ్వు నేను, ఆది, సింహాద్రి, యమగోల మళ్ళీ మొదలయింది లాంటి చిత్రాల్లో రమ్యశ్రీ నటించింది. అయితే బోల్డ్ పాత్రలు చేయడంతో ఆమె చాలా విమర్శలు కూడా ఎదుర్కొంది. అలాగే బోల్డ్ రోల్స్ చేయడం వల్ల చాలా మంది తనను తప్పుడు ఉద్దేశంతో చూశారని తెలిపింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె కారులో తనను బలవంతం చేయబోయారని తెలిపి షాక్ ఇచ్చింది.

ఇది కూడా చదవండి : నాలుగు భాషల్లో రీమేక్ అయిన సినిమా.. కానీ తెలుగులో డిజాస్టర్.. అదేంటంటే

ఆమె మాట్లాడుతూ.. నన్ను ఈవెంట్స్ కు పిలవలనుకున్నా.. ఆమె బట్టలు సరిగ్గా వేసుకోదు ఎందుకు అని కామెంట్స్ కూడా  చేసేవారు. అమెరికాలో ఓ ఈవెంట్ కోసం ముందుగా రమ్యను పిలిచారట.. ఆ తర్వాత ఆమె అసభ్యకరంగా బట్టలు వేసుకుంటుంది అని ఆమెను వద్దు అని కొందరు అన్నారట.. ఆ తర్వాత కొంతమంది బట్టల్లో ఏముంది.. ఇక్కడ మనం వేసుకోవడం లేదా అని సపోర్ట్ గా మాట్లాడి తనను ఇన్వైట్ చేశారు అని తెలిపింది. ఆ తర్వాత అక్కడ నన్ను చూసి అంతా షాక్ అయ్యారు. సినిమాల్లో అంత బోల్డ్ గా ఉంటారు బయట చాలా డీసెంట్ గా ఉన్నారు అని షాక్ అయ్యారట. ఓ పెద్దాయన నన్ను ఉద్దేశిస్తూ.. చీర కట్టిన ప్రతి ఆడది పతివ్రత కాదు.. డ్రెస్ ని చూసి అంచనా వేయకూడదు అని అన్నారు అని తెలిపింది. అలాగే తనకు బీ గ్రేడ్ సినిమాలో నటించమని కూడా ఆఫర్స్ వచ్చాయి అని తెలిపింది. నీలి చిత్రాల్లో నటించమని నాపై చాలా మంది ఒత్తిడి తెచ్చారు. నేను అలాంటి సినిమాలు చేయను అని గట్టిగా వాదించాను. సినిమాల్లో దర్శకులు చెప్పారని పొట్టి బట్టలు వేసుకుంటాను అంత మాత్రానా అలాంటి సినిమాలు చేయను అని అన్నారు రమ్య శ్రీ. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి : సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో.. చాలా బాధపడ్డానన్న నేచురల్ బ్యూటీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us