ఐటీ దాడుల అనంతరం మళ్ళీ ‘దుబారా’ చిత్రం షూట్ లో తాప్సీ , అనురాగ్ కశ్యప్
తమ ఇళ్ళు, కార్యాలయాలపై ఐటీ దాడుల అనంతరం బాలీవుడ్ సెలబ్రిటీలు అనురాగ్ కశ్యప్, తాప్సీ పొన్ను మళ్ళీ తమ తాజా చిత్రం 'దుబారా' షూట్ లో నిమగ్నమయ్యారు. వీరి ఇళ్లపైనా, కార్యాలపైనా ఐటీ అధికారులు మూడు రోజులుగా దాడులు, సోదాలు నిర్వహించారు.
తమ ఇళ్ళు, కార్యాలయాలపై ఐటీ దాడుల అనంతరం బాలీవుడ్ సెలబ్రిటీలు అనురాగ్ కశ్యప్, తాప్సీ పొన్ను మళ్ళీ తమ తాజా చిత్రం ‘దుబారా’ షూట్ లో నిమగ్నమయ్యారు. వీరి ఇళ్లపైనా, కార్యాలపైనా ఐటీ అధికారులు మూడు రోజులుగా దాడులు, సోదాలు నిర్వహించారు. ముంబైతో బాటు ఢిల్లీ, పూణే, హైదరాబాద్ నగరాల్లో ఈ దాడులు జరిగాయి. వీటిపై తాప్సీ పొన్ను వ్యంగ్యంగా స్పందిస్తూ ట్వీట్లు చేయగా..తమ ఈ చిత్రం సెట్స్ పైనుంచి కశ్యప్ తాజా ఫోటోలను షేర్ చేశారు. బిహైండ్ ద సీన్ అంటూ ఆయన..తమను ద్వేషించిన వారందరికీ ఇక తమ ప్రేమాభిమానాలని అన్నారు. ఓ కుర్చీలో తాప్సీ కూర్చుని ఉండగా ఆమె ఒడిలో తాను కూడా నవ్వుతు కూర్చున్న ఫోటోను ఆయన విడుదల చేశారు. మేం ‘దుబారా’ మూవీ షూట్ ను తిరిగి ప్రారంభించాం.. మమ్మల్నిద్వేషించే వారికిదే మా లవ్ అని చమత్కరించారు. తాప్సి కూడా తమ ‘మన్మారిజియాన్’ చిత్రం తరువాత కశ్యప్ దర్శకత్వంలో తను మళ్ళీ నటిస్తున్నానని ట్వీట్ చేసింది.2018 లో మన్మారిజియాన్ చిత్రం విడుదలైంది.
కాగా-దుబారా చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ తో కూడినదని తెలుస్తోంది. ఈ మూవీ టీజర్ ని గత నెల 12 న విడుదల చేశారు. ఇలా ఉండగా వీరి ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేసిన ఐటీ అధికారులు, వీరి ఆదాయానికి, వీరి చిత్రాల కలెక్షన్లకు పొంతన లేదని, సుమారు 650 కోట్ల వ్యత్యాసాన్ని తాము కనుగొన్నామని వెల్లడించారు. అయితే ఇవి 350 కోట్లని మరి కొన్నిపత్రికలు రాశాయి. ఏమైనా.. బాలీవుడ్ లో ఇంతమంది సెలబ్రిటీలు ఉండగా ముఖ్యంగా కేవలం ఈ ఇద్దరినే ఐటీ శాఖ టార్గెట్ చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. మధు మంతెన, వికాస్ బెహెల్ వంటివారి ఇళ్ళు, ఆఫీసులపై కూడా సోదాలు జరిగినా వీరికి సంబంధించి జరిగిన రైడ్ ల పైనే అధికారులు స్పందించారు. అటు-వీటిపై తాప్సీ ట్వీట్లను చూసిన ఈమె అభిమానులు ఈమెను ప్రశంసలతో ముంచెత్తారు. సరిగ్గా స్పందించావంటూ ఆకాశానికెత్తేశారు.
మరిన్ని ఇక్కడ చుడండి: