Taapsee Pannu: ఐటీ అధికారుల సోదాలపై తొలిసారి స్పందించిన తాప్సీ.. పారిస్‌లో తనకు ఓ బంగ్లా ఉందంటూ..

Taapsee Pannu: గత మూడురోజులుగా బాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఆదాయ పన్ను (ఐటీ) అధికారుల సోదాలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌, నటి తాప్సీతో పాటు పలువురు ఇళ్లు, కార్యలయాల్లో పెద్ద ఎత్తున ఐటీ దాడులు..

Taapsee Pannu: ఐటీ అధికారుల సోదాలపై తొలిసారి స్పందించిన తాప్సీ.. పారిస్‌లో తనకు ఓ బంగ్లా ఉందంటూ..
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Mar 06, 2021 | 3:39 PM

Taapsee Pannu: గత మూడురోజులుగా బాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఆదాయ పన్ను (ఐటీ) అధికారుల సోదాలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌, నటి తాప్సీతో పాటు పలువురు ఇళ్లు, కార్యలయాల్లో పెద్ద ఎత్తున ఐటీ దాడులు జరిగిన విషయం తెలసిందే. అనురాగ్‌కు చెందిన సినిమా నిర్మాణ సంస్థ ఫాంటమ్‌లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని. ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేతకు దిగారనే ఆరోపణలతో అధకారులు ఈ దాడులకు దిగారు. ఇదిలా ఉంటే తాప్సీకి సంబంధించి కూడా పలు చోట్ల వరుస సోదాలు జరగడంతో అటు బాలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లోనూ టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. హైదరాబాద్‌లో జరిగిన సోదాల్లో తాప్సీకి సంబంధించి రూ.5 కోట్ల రశీదులు దొరికాయని చర్చ జరిగింది. అయితే వీటిపై గతకొన్నిరోజులుగా స్పందించని నటి తాప్సీ తొలిసారి నోరు విప్పింది. ట్విట్టర్‌ వేదికగా ఈ అంశంపై పలు వరుస ట్వీట్లు చేసింది.ఈ క్రమంలోనే మూడు రోజులుగా తన నివాసంలో ఏం జరిగిందో చెబుతూ వరుసగా ట్వీట్లు చేసింది. పారిస్‌లో తనకు ఓ బంగ్లా ఉందంటూ తాళాల కోసం వెతికారని చెప్పుకొచ్చింది. ఇక రూ.ఐదు కోట్లు తీసుకున్నానని ఆరోపిస్తూ దాని రశీదులు కోసం వెతికారని, కానీ తానెప్పుడూ ఆ మొత్తాన్ని తీసుకోలేదని తేల్చి చెప్పింది. ‘ఇక మన గౌరవ ఆర్థిక శాఖ మంత్రి చెప్పినట్లు 2013లో నా నివాసంలో ఐటీ సోదాలు జరిగిన విషయం నాకు గుర్తులేదు’ అంటూ ట్వీట్‌ చేసింది. ఇదిలా ఉంటే.. బాలీవుడ్‌లో పలువురిపై జరుగుతోన్న ఐటీ దాడుల గురించి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ‘2013లో కూడా వాళ్లపై ఐటీ దాడులు జరిగాయి. ఆ సమయంలో పట్టించుకోని ఈ సమస్యను ఇప్పుడెందుకు ఇంత పెద్ద విషయంగా చూస్తున్నారు’ అని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలకు బదులుగా తాప్సీ ఈ ట్వీట్లు చేసింది.

వైరల్‌గా మారిన తాప్సీ బాయ్‌ ఫ్రెండ్ ట్వీట్‌..

ఇదిలా ఉంటే అంతకుముందు తాప్సీ ఇళ్లపై జరుగుతోన్న ఐటీ రైడ్స్‌ విషయమై ఆమె బాయ్‌ ఫ్రెండ్‌ ఇండియాకు చెందిన అథ్లెట్‌ టీమ్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్న మాథ్యుస్‌ బోయ్‌ స్పందిస్తూ.. అనవసరంగా తాప్సీతో పాటు తన కుటుంబంలో ఒత్తిడి తీసుకువస్తున్నారని దీనిపై కేంద్ర క్రీడా శాఖ మంత్రి స్పందించాలంటూ కిరణ్‌ రిజుజును ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేశాడు. దీంతో ఈ ట్వీట్‌కు రిప్లై ఇచ్చిన మంత్రి.. ‘అన్నికంటే చట్టం గొప్పది . మనమంతా దానికి కట్టుబడి ఉండాలి. ఈ విషయం నా పరిధిలోనిది కాదు. ఇక భారత క్రీడా రంగానికి సంబంధించి నేను నా విధులకు కట్టుబడి ఉన్నాను అంటూ’ కౌంటర్‌ ఇచ్చారు. మరి ఈ వివాదం ఎంత వరకు వెళుతుందో చూడాలి.

Also Read: Encounter: మ‌హారాష్ట్ర – ఛత్తీస్‌గడ్ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్.. నక్సల్స్ ఆయుధాల డంప్ ధ్వంసం

నాసా టీమ్ లో ఇండియన్ అమెరికన్ స్వాతి మోహన్ కు అధ్యక్షుడు జోబైడెన్ ప్రశంస

Akshara Movie : థియేట్రికల్ రిలీజ్ అయ్యి.. వారానికే డిజిటల్ ఫ్లాట్‌‌‌‌‌‌‌ఫార్మ్‌‌లో దర్శనమిచ్చిన సినిమా…