చైనా గోడను కాలినడకన దాటడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలుసా
19 April 2025
Pic credit- Unsplash
TV9 Telugu
'ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా' ప్రపంచంలోని 7 అద్భుతాలలో ఒకటిగా ఖ్యాతిగాంచింది. దీన్ని నిర్మించడానికి దాదాపు 2 వేల సంవత్సరాలు పట్టింది. దీనిని చైనా జాతీయ చిహ్నంగా కూడా పిలుస్తారు
మీరు చైనాలోని అతిపెద్ద గోడను చేరుకోవాలనుకుంటే ముందుగా చైనా రాజధాని బీజింగ్‌కు వెళ్లాలి. ఇక్కడి నుంచి 1 నుంచి 1.5 గంటల సేపు ప్రయాణించాలి.
చైనా గోడను క్రీస్తుపూర్వం 5వ శతాబ్దంలో ప్రారంభించి క్రీ.శ. 16వ శతాబ్దం వరకు నిర్మించారు. ఈ గోడ మొత్తం పొడవు 21,196 కి.మీ.
అయితే మీరు ఈ గోడను కాలినడకన దాటాలనుకుంటే ఎంత సమయం పడుతుందో తెలుసా. ఈ గోడ పసుపు సముద్రం వద్ద ముగుస్తుంది.
మీరు ఈ చైనా గోడను కాలినడకన దాటాలనుకుంటే.. 2 నుంచి 3 సంవత్సరాలు పట్టవచ్చని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో మూడు సంవత్సరల కంటే కూడా ఎక్కువ సమయం పట్టవచ్చునట
ఉత్తరాది నుంచి వచ్చే ఆక్రమణదారుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి చైనా చక్రవర్తులు ఈ గోడను నిర్మించారు. దీనిని అంతరిక్షం నుంచి కూడా చూడవచ్చని అంటారు. వాస్తవంగా ఇది అంతరిక్షం నుంచి కంటితో కనిపించదు
ఈ అతి పొడవైన చైనా గోడను నిర్మాస్తున్న సమయంలో దాదాపు 4 లక్షల మంది మరణించారని చెబుతారు.