ఫ్యాటీ లివర్ ఉన్నవారు రోజూ ఎంత పెరుగు తినాలంటే..

18 April 2025 

Pic credit- Social Media

TV9 Telugu

కాలేయంలో కొవ్వు పరిమాణం పెరిగినప్పుడు.. దానిని ఫ్యాటీ లివర్ వ్యాధి అంటారు. సాధారణంగా ఇది ఎక్కువగా వేయించిన ఆహారం తినడం వల్ల జరుగుతుంది.

ఫ్యాటీ లివర్ రోగులు పెరుగుకి దూరంగా ఉంటారు. పెరుగులో కొవ్వు ఉంటుంది. కనుక అధిక కొవ్వు పదార్ధాలు తీసుకోకపోవడం మంచిదని భావిస్తారు.

ఫ్యాటీ లివర్ ఉన్నవారు పెరుగు తినవచ్చని డైటీషియన్ మోహిని డోంగ్రే అంటున్నారు. అయితే పెరుగును పూర్తి కొవ్వు పాలతో తయారు చేయకూడదని గుర్తుంచుకోండి.

ఫ్యాటీ లివర్ ఉన్నవారు ఎల్లప్పుడూ నో ఫ్యాట్‌ మిల్క్ లేదా స్లిమ్ మిల్క్ తో తయారు చేసిన పెరుగును తినాలి. మీకు కావాలంటే లస్సీ కూడా తాగవచ్చు.

అంతేకాదు రోజూ కనీసం అరగంట పాటు వ్యాయామం కూడా చేయాలి. ఇది  ఫ్యాటీ లివర్ ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది

అంతేకాదు తినే ఆహారంలో ఆకుకూరలను చేర్చుకోండి. ఆకుకూరలు కాలేయానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది

ఫ్యాటీ లివర్ ఉన్నవారు నూనె పదార్థాలకు దూరంగా ఉండాలి. అంతేకాదు బయట లభించే అధిక సోడియం, కారంగా ఉండే ఆహార పదార్ధాలకు దూరంగా ఉండండి.