Baby Elephant: పాలు పట్టుకొచ్చిన సంరక్షకులు.. పరుగెత్తుకొచ్చిన ఏనుగులు.. చూస్తుండగానే..
Baby Elephant: కొన్ని మూగ జీవాలు చేసే పనులు చూడముచ్చటగా ఉంటాయి. అవి చేసే పనులను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే క్షణాల్లో..
Baby Elephant: కొన్ని మూగ జీవాలు చేసే పనులు చూడముచ్చటగా ఉంటాయి. అవి చేసే పనులను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే క్షణాల్లో వైరల్ అవుతాయి. తాజాగా ఇలాంటి సీన్ ఒకటి వెలుగు చూసింది. ఓ ఏనుగు పిల్లలు పాల కోసం పరుగులు తీశాయి. పాల డబ్బాను అమాంతం నోట్లో పెట్టుకుని గడగడా తాగేశాయి. కడుపు నిండగా హమ్మయ్య అనుకుని వెనుదిరిగి వెళ్లిపోయాయి. ఈ ఘటన కెన్యాలోని నైరోబీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. నైరోబీకి చెందని ఓ ఎన్జీవో సంస్థ అడవిలోని అనాథ ఏనుగు పిల్లలను తీసుకువచ్చి సంరక్షిస్తోంది. వాటికి సమయానికి ఆహారం అందిస్తూ ఆ గున్న ఏనుగుల ఆలనాపాలనా చూస్తున్నారు సంరక్షకులు.
అయితే, ఇందులో భాగంగానే తాజాగా సంరక్షకులు గున్న ఏనుగులకు ఫీడ్‌గా పాలు డబ్బాలలో పట్టుకొచ్చారు. పాపం.. అవి బాగా ఆకలితో ఉన్నట్లున్నాయి. పాల డబ్బాలు వారు తీసుకురావడాన్ని అంతదూరం నుంచే గమనించిన ఏనుగు పిల్లలు.. పరుగెత్తుకుంటూ వారి వద్దకు వచ్చాయి. అమాంతం ఆ పాల డబ్బాలను నోట్లో పెట్టుకుని గడగడా పాలు తాగేశాయి. అయితే ఏనుగు పిల్లల సంరక్షకులు దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో అది కాస్తా తెగ వైరల్ అవుతోంది. చిన్న చిన్న ఏనుగు పిల్లలు పాల కోసం పరుగలు తీయడానికి చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. వాటిని బాగా చూసుకోండి అంటూ సూచిస్తున్నారు.
Baby Elephants Video:
Also read:
Telangana Assembly: తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన.. మార్చి 15 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..