Telangana Assembly: తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన.. మార్చి 15 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
Telangana Assembly Session: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మార్చి 15వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలను నిర్వహించనున్నట్లు..
Telangana Assembly Session: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మార్చి 15వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి మంగళవారం నాడు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటన ప్రకారం.. మార్చి 15వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతుండగా.. అదే రోజు ఉదయం 11 గంటలకు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. 16వ తేదీన దివంగత ప్రజాప్రతినిధుల మృతి పట్ల సంతాప తీర్మానం ఉంటుంది. ఈనెల 17న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతారు. ఇక 18వ తేదీన ఉదయం 11.30 నిమిషాలకు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
Also read: