Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Privitization Process: దేశంలో శరవేగంగా ప్రైవేటైజేషన్.. పీఎస్యూలు, లిస్టెడ్ కంపెనీలు.. అన్నింట్లోంచి వాటా విక్రయం

మూడు దశాబ్దాల క్రితం ఆర్థిక సరళీకరణ, సంస్కరణల పర్వంలో భాగంగా దేశంలో ప్రైవేటైజేషన్ ప్రాసెస్ మొదలైంది. అయితే గత దశాబ్ద కాలంగా ప్రైవేటైజేషన్..

Privitization Process: దేశంలో శరవేగంగా ప్రైవేటైజేషన్.. పీఎస్యూలు, లిస్టెడ్ కంపెనీలు.. అన్నింట్లోంచి వాటా విక్రయం
Follow us
Rajesh Sharma

|

Updated on: Mar 09, 2021 | 4:28 PM

Privatization process in India speeded-up in recent years: మూడు దశాబ్దాల క్రితం ఆర్థిక సరళీకరణ, సంస్కరణల పర్వంలో భాగంగా దేశంలో ప్రైవేటైజేషన్ ప్రాసెస్ మొదలైంది. అయితే గత దశాబ్ద కాలంగా ప్రైవేటైజేషన్ ప్రక్రియ వేగమందుకుంది. 2013 నాటికి పరిస్థితిని అంఛనా వేస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువ ప్రైవేటైజేషన్ ఎక్కువగా జరిగింది. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ నుంచి పెట్టుబడి దారి వ్యవస్థ వైపు అడుగులు వేగంగా పడుతున్నాయి. 1991-92 కాలంలో ప్రారంభమైన ఆర్థిక సరళీకరణలో భాగంగా ప్రారంభమైన ప్రైవేటీకరణ గత పదేళ్ళుగా జోరందుకుంది. 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఎన్నో ప్రభుత్వ రంగం సంస్థలుండేవి.

ఉమ్మడి ఏపీలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని పబ్లిక్ సెక్టర్ యూనిట్లు:

1.ఆంధ్రా బ్యాంక్ 2.భారత్ డైనమిక్స్ లిమిటెడ్, హైదరాబాద్ 3.భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెస్సేల్స్ లిమిటెడ్, విశాఖపట్టణం 4.డ్రెడ్జింగ్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ విశాఖపట్టణం 5.ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియ లిమిటెడ్, హైదరాబాద్ 6.హిందుస్థాన్ ఫ్లోరోకార్బన్స్ లిమిటెడ్, హైదరాబాద్ 7.హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్, విశాఖపట్టణం 8.హెచ్ ఎంటీ బేరింగ్స్ లిమిటెడ్, హైదరాబాద్ 9.మిశ్రదాతు నిగమ్ లిమిటెడ్., హైదరాబాద్ 10.నేషనల్ మినరల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్, హైదరాబాద్ 11.ప్రాగా టూల్స్ లిమిటెడ్, సికింద్రబాద్ 12.స్పాంజి ఐరన్ ఇండియా లిమిటెడ్, హైదరాబాద్ 13. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్ 14.విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్, విశాఖపట్టణం

నిజానికి 2013 నాటికి పెట్టుబడుల ఉపసంహరణలో ఆంధ్రప్రదేశ్ టాప్‌గా వుండిండి. 2013 నాటికి మొత్తం 10 రాష్ట్రాల్లో 39 పీఎస్యూ యూనిట్లను కేంద్ర ప్రభుత్వం విక్రయించింది. దేశంలో ప్రైవేటీకరణ ప్రకటించక మునుపే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేటీకరణ ప్రారంభమైంది. 1989లోనే అల్విన్ నిస్సాన్‌ను మహీంద్రా కంపెనీకి విక్రయించారు. 15 యూనిట్లను ప్రైవేటీకరించారు. లిస్టెడ్ కంపెనీలైన వోల్టాస్, వీఎస్టీ, టాటా మోటార్స్, ఏసీసీ కంపెనీల్లోని ప్రభుత్వ వాటాల విక్రయించారు. 2011-12 నాటికి దేశంలో పీఎస్యూల సంఖ్య 71 కాగా.. వాటిలో పనిచేస్తున్నవి 47, పనిచేయనివి 24. స్టాట్యుటరీ కార్పోరేషన్లు మూడు వుండగా అవన్నీ పని చేస్తునే వుండేవి. 2021-22 బడ్జెట్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా సమీకరించాల్సిన మొత్తం రూ.1.75 లక్షల కోట్లుగా కేంద్రం నిర్ణయించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ మొత్తం రూ.2.1 లక్షల కోట్లు. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్పోరేట్ విభాగం రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(ఆర్ఐఎన్ ఎల్)ను ప్రైవేటీకరిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

2020 ఏప్రిల్ నుంచి 2021 ఫిబ్రవరి వరకు దేశంలో మూతపడ్డ రిజిస్టర్డ్ కంపెనీల సంఖ్య పదివేల నూటా పదమూడు (10,113) కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పార్లమెంటులో వెల్లడించిన వివరాల ప్రకారం ఢిల్లీ… 2,394, యూపీ.. 1,936, తమిళనాడు…1,322, మహారాష్ట్ర 1,279, కర్ణాటక.. 836, చండీగఢ్.. 501, రాజస్థాన్.. 479, తెలంగాణ.. 404, కేరళ…307, జార్ఖండ్.. 137, మధ్యప్రదేశ్.. 111, బీహార్ 104 కంపెనీలు గత పదినెలలుగా మూతపడ్డాయి.

నిజానికి ప్రస్తుతమున్న అన్ని రాజకీయ పార్టీలు పెట్టుబడుల ఉపసంహరణకు, ప్రైవేటైజేషన్‌కు అనుకూలమైనవే. వామ పక్ష పార్టీలు పైకి ఆర్థిక సంస్కరణలను వ్యతిరేకిస్తున్నా.. పెట్టుబడుల ఉపసంహరణను, ప్రైవేటైజేషన్ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్ళిన యూపీఏ-1కి వామపక్షాలు మద్దతునిచ్చాయి. దీంతో సంస్కరణల విషయంలో కమ్యూనిస్టులు చెప్పేదొకటి చేసేదొకటిగా తేలిపోయింది. ఇక వ్యాపారం ప్రభుత్వాల పని కాదంటూ పదే పదే చెబుతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డిజిన్వెస్టుమెంటు ప్రక్రియను వేగవంతం చేశారు. కీలక రంగాలు తప్ప మిగిలినవన్నీ ప్రైవేటుకేనని ఆయన చెప్పకనేచెబుతున్నారు.

1995-2004 మధ్య కాలంలో ఉమ్మడి ఏపీలో ఆర్థిక సంస్కరణలను అమలు చేసిన చంద్రబాబుపై అప్పట్లో కాంగ్రెస్, వామపక్ష పార్టీలు పెద్ద ఉద్యమాలే చేశాయి. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో తాము వ్యతిరేకించిన ఆర్థిక విధానాలనే కొనసాగించాయి. అయితే ఈ విషయంలో బీజేపీ కాస్త మెరుగనే చెప్పాయి. బీజేపీ ఎప్పుడు ఆర్థిక సంస్కరణలకు వ్యతిరేకమని చెప్పలేదు. నిజానికి యూపీఏ ఆధ్వర్యంలో కొనసాగిన డిజిన్వెస్టు మెంటు ప్రక్రియకు బీజేపీ మద్దతునిచ్చింది. తాము అధికారంలోకి వచ్చాక అదే విధానాన్ని కొనసాగిస్తూ దేశంలో పెట్టుబడుల ఉపసంహరణను వేగంగా అమలు చేస్తోంది.

విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలోని కేంద్ర ప్రభుత్వ వాటాను ప్రైవేటు సంస్థలకు విక్రయించే విషయంలో జనవరి చివరి వారంలో నిర్మలాసీతారామన్ నుంచి ప్రకటన వెలువడిన నాటి నుంచి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఆందోళనకు కార్మిక సంఘాలు శ్రీకారం చుట్టాయి. ఈ ఆందోళనకు కారణాలేవైతేనేం అధికార వైసీపీ, విపక్ష టీడీపీ, వామపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. బీజేపీకి మిత్ర పక్షమైన జనసేన సంఘీభావం ప్రకటించింది. అయితే.. ఈ ప్రైవేటీకరణ ఆగదని ఈ పార్టీలకు తెలియదని ఎవరు అనుకోలేరు. ఎందుకంటే దేశంలో అన్ని పబ్లిక్ సెక్టర్ కంపెనీల్లో పెట్టుబడుల ఉపసంహరణకు ఓ విధానం.. ఏపీలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి మరో విధానం వుండదని ఏ మాత్రం అవగాహన ఉన్న వారికైనా తెలుస్తుంది. అలాంటప్పుడు కార్మికులకు లేనిపోని ఆశలు కల్పించడంలో ఔచిత్యమేంటనేదే అసలు ప్రశ్న.

ALSO READ: పెట్టుబడుల ఉపసంహరణ ఆగదంటున్న కేంద్రం.. దేశంలో ఇప్పటి వరకు డిజిన్వెస్టుమెంటు ప్రాసెస్ ఇదే!

ALSO READ: ఒక్క నినాదం.. బెంగాల్ ఎన్నికలను కుదిపేస్తోంది.. ఎవరి నోట విన్నా అదే మాట.. ఇంతకీ ఏంటది?