Kakani Govardhan Reddy: దేశం విడిచి వెళ్లొద్దు.. కాకాణి గోవర్ధన్ రెడ్డిపై లుక్‌ఔట్ నోటీసులు..
అక్రమ మైనింగ్ కేసులో వైసీపీ నేత, మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. తాజాగా.. ఏపీ పోలీసులు కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. పోలీసులు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి మూడు సార్లు నోటీసులు ఇచ్చారు.. అయినా ఆయన విచారణకు హాజరు కాలేదు. 12 రోజులుగా కాకాణి, మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

అక్రమ మైనింగ్ కేసులో వైసీపీ నేత, మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. తాజాగా.. ఏపీ పోలీసులు కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. గురువారం మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై లుక్‌ఔట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు.. అన్ని ఎయిర్‌పోర్ట్‌లు, సీపోర్టులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఇప్పటికే హైకోర్టులో కాకాణి ముందస్తు బెయిల్ తిరస్కరణకు గురైంది. కాకాణి వేసిన అనుబంధ పిటిషన్‌ను హైకోర్టు డిస్‌మిస్ చేసింది.
ఇప్పటికే.. పోలీసులు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి మూడు సార్లు నోటీసులు ఇచ్చారు.. అయినా ఆయన విచారణకు హాజరు కాలేదు. 12 రోజులుగా కాకాణి, మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరి ఆచూకీ కోసం ఎస్పీ కృష్ణకాంత్ నేతృత్వంలో ఆరు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తున్నాయి.
క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగంపై పొదలకూరు పోలీసు స్టేషన్‌లో కాకాణి సహా పలువురిపై కేసు నమోదైంది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని ఏ4గా చేర్చారు. అంతేకాకుండా కాకానిపై అట్రాసిటీ, పోలీసులను దూషించిన ఘటనపై కేసులను నమోదు చేశారు. తన అనుచరులతో కలిసి విదేశాలకు కలిసి రూ.250 కోట్లకుపైగా విలువ చేసే క్వార్ట్జ్ ఎగుమతి చేసినట్లు ఆరోపణలున్నాయి.
అయితే కాకాణి అజ్ఞాతవాసం నెల్లూరు పోలీసులకు సవాల్‌గా మారింది. ఆయన జాడ కోసం జల్లెడ పడుతున్నారు పోలీసులు. విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చినా.. స్పందించలేదు. దీంతో లుకౌట్ నోటీసు జారీ చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




