10 April 2025
స్పిరిట్ సినిమా నుంచి తప్పుకున్న ఆ స్టార్ హీరోయిన్.. ? ఎందుకంటే..
Rajitha Chanti
Pic credit - Instagram
ప్రస్తుతం వరుసగా సూపర్ సక్సెస్ అందుకుంటూ ఫుల్ ఫాంలో దూసుకుపోతుంది ఈ హీరోయిన్. చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది.
తెలుగుతోపాటు హిందీలోనూ బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాల్లో నటిస్తూ వసూళ్లు సునామి సృష్టిస్తుంది. ఆమె పాన్ ఇండియా బాక్సాఫీస్ క్వీన్.
కానీ ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ప్రభాస్ నటించనున్న స్పిరిట్ సినిమా నుంచి తప్పుకుందనే ప్రచారం సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.
ఇంతకీ ఆమె ఎవరో కాదు.. రష్మిక మందన్నా. పుష్ప 2, యానిమల్, ఛావా వంటి సినిమాలతో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది రష్మిక.
కానీ ఇటీవల ఆమె నటించిన సికందర్ సినిమా మాత్రం అంతగా మెప్పించలేకపోయింది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించారు.
ఇదిలా ఉంటే.. ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న స్పిరిట్ చిత్రంలో రష్మిక కథానాయికగా ఎంపికైందనే ప్రచారం నడుస్తుంది.
త్వరలోనే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారని టాక్. ఇంతలోనే స్పిరిట్ మూవీ గురించి మరో క్రేజీ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.
నెట్టింట వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నుంచి రష్మిక తప్పుకుందట. ఇందుకు గల కారణాలు తెలియరాలేదు. కానీ ఈ ప్రచారం జోరుగా నడుస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్