దాల్చిన చెక్క ఒక సుగంధ ద్రవ్యమే కాదు.. ఆరోగ్యప్రదాయిని కూడా. దాల్చిన చెక్కలో పాలీఫెనాల్స్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
దాల్చిన చెక్కలోని పోషకాలు శరీరంలోని కణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. దీన్ని సరిగా ఉపయోగిస్తే బోలెడన్ని ఉపయోగాలు ఉంటాయి.
దాల్చిన చెక్క మెరుగైన జ్ఞాపకశక్తి,ఆలోచనా శక్తి పెరుగుతుంది. ఇందులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. రోగ నిరోధకశక్తి పెరుగుతుంది.
దాల్చిన చెక్క రక్తపోటును తగ్గించడంలో, ట్రైగ్లిజరైడ్లు (చెడు) కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది HDL (మంచి) కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది.
ఇన్సులిన్ రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిస్తుంది. దాల్చిన చెక్క సైతం అదే పని చేస్తుంది. ఇది టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఉపయోగకరంగా ఉంటుంది.
దాల్చిన చెక్క జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపించడంలో సహాయపడుతుంది అజీర్తి, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. తిన్నది తేలికగా జీర్ణమవుతుంది.
దాల్చిన చెక్క జీవక్రియను వేగవంతం చేయడంలో కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. ఇది ఆకలిని నియంత్రిస్తుంది కూడా. ఋతుక్రమ సమస్యలకు చెక్ పెడుతుంది.
దాల్చిన చెక్క హార్మోన్లను సమతుల్యం చేయడం ద్వారా గర్భాశయానికి రక్త ప్రవాహాన్ని పెంచడం ద్వారా ఋతుక్రమాన్ని క్రమబద్ధీకరించడంలో నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.