శుంఖుపుష్పాన్ని అపరాజిత, గిరికర్ణిక, దింటెన అనే పేర్లతోనూ పిలుస్తుంటారు. ఈ పుష్పాన్ని పూజలో ఎంత ప్రవిత్రంగా భావిస్తారో ఆయుర్వేదంలోనూ అంతే ప్రత్యేకంగానూ బావిస్తుంటారు.
ఆయుర్వేద వైద్యంలో ఎన్నో అనారోగ్యాల చికిత్సకు శంఖుపుష్పాన్ని వాడుతుంటారు. వీటితో టీ చేసి తీసుకుంటే అనేక ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఈ టీని ఎండిన శంఖుపుష్పాలతో తయారు చేస్తారు. ఈ టీ నీలం రంగులో ప్రత్యేకంగా ఉంటుంది. ఈ టీ శక్తివంతమైన ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
శంఖుపుష్పం టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. ఎసిడిటీ, మలబద్ధకం, గ్యాస్, కడుపుఉబ్బరం సమస్యలు నయం అవుతాయి.
ఖాళీ కడుపుతో వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఒక కప్పు టీ తాగితే.. జీర్ణక్రియలో పేరుకున్న టాక్సిన్స్ తొలగుతాయి. ఇది జీర్ణక్రియ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
బరువు తగ్గేవారికి ఈ టీ ఎంతో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. శంఖుపువ్వుల టీలో కెఫిన్ ఉండదు. అలాగే కార్బోహైడ్రేట్స్, కొవ్వులు, కొలెస్ట్రాల్ ఉండవు.
జీర్ణక్రియ నుంచి ఆహార వ్యర్థాలు, టాక్సిన్స్‌ను తొలగిస్తాయి, ఆకలిని నియంత్రిస్తుంది. చిరుతిండ్లు తినాలనే కోరికను తగ్గిస్తుంది. మీ బరువును కంట్రోల్‌లో ఉంచే అద్భుతమైన హెర్బల్ డ్రింక్.
ఈ టీలో ఫినోలిక్ యాసిడ్, ఫినాలిక్ అమైడ్ యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీహైపెర్గ్లైసీమిక్ గుణాలు మెండుగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ స్రావాన్ని మెరుగుపరుస్తాయి.
గ్లూకోజ్ జీవక్రియను నియంత్రిస్తాయి. ఉపవాసం ఉన్నప్పుడు, భోజనం చేసిన తర్వాత శరీర కణాల ద్వారా చక్కెరలను అధికంగా శోషించడాన్ని నిరోధిస్తుంది. షుగర్ పేషెంట్స్‌కి కూడా మంచిది