ఇది సుగంధ ద్రవ్యాల రాజు..! ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..
Jyothi Gadda
27 March 2025
ఆర్థరైటిస్, కడుపు మంట చికిత్సతో సహా చాలా రకాలుగా ఇది నివారణకు ఉపయోగపడుతుంది. అయితే దీనివల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.
పిప్పలి ఒక సాంప్రదాయిక ఆయుర్వేద మూలిక, దీనిలో పిపెరిన్ అనే క్రియాశీల పదార్థం ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడం, శ్వాస సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది.
పిప్పలి పొడిలోని పిపెరిన్, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్లను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది.
పిప్పలి పొడి, తేనె కలిపిన మిశ్రమం శ్వాస సంబంధిత సమస్యలను తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. దీని వల్ల కఫం, ముక్కులో రంధ్రాల సంశ్లేషణ తగ్గుతుంది.
ఇది ఆస్తమా, బ్రాంకైటిస్, సర్ది, దగ్గు వంటి సమస్యలకు సహాయపడుతుంది. పిప్పలిని తీసుకోవటం వల్ల పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అద్భుతంగా సహాయపడుతుంది.
పిప్పలి శక్తివంతమైన శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది నొప్పి, వాపు, దృఢత్వం వంటి ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కీళ్ల నొప్పులను అరికట్టి, బలోపేతం చేయడంలో సహాయపడతాయి. అంతేకాదు పిప్పాలి వాపును తగ్గించడం, కీళ్లను బలోపేతం చేస్తుంది.
పిప్పలి జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రోత్సహించి, ఆహార శోషణను మెరుగుపరుస్తుంది. దీని వల్ల జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ఇందులో ఉండే లక్షణాలు కడుపులో మంటను తగ్గిస్తాయి.
అంతేకాదు పిప్పలి అజీర్ణం, గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలను తగ్గిస్తుంది. పిప్పలి పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధిని ప్రోత్సహించడం, హానికరమైన బ్యాక్టీరియాను తొలగిస్తుంది.