మట్టిలో మాణిక్యం అంటే ఇదే.. యువకుడి ట్యాలెంట్‌కు మతి పోవాల్సిందే వీడియో
ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. విద్యకు, ప్రతిభకు సంబంధం లేదు.. విద్యలేని ప్రతిభావంతులెందరో భారతావని సొంతం. సోషల్ మీడియా పుణ్యమా అని ఇలాంటి మట్టిలో మాణిక్యాలెందరో ప్రపంచానికి పరిచయమవుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి అద్భుతమైన మంచాన్ని తయారుచేసి నెటిజన్లతో శభాష్ అనిపించుకుంటున్నాడు. రాజతల్పాన్ని తలపిస్తున్న ఆ మంచానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతని ట్యాలెంట్‌ను అందరూ మెచ్చుకుంటున్నారు.
కొందరు తమ వృత్తిలోనే అద్భుతాలు సృష్టిస్తుంటారు. అతను సిమెంట్ పనిచేసే వ్యక్తిలా కనిపించాడు. తన నైపుణ్యంలో అద్భుతమైన మంచాన్ని ఇటుక, సిమెంట్‌తో రూపొందించాడు. అదేదో ఆషామాషీగా కనిపించే బల్లలా కాదు.. చక్కని కళానైపుణ్యంతో రాజతల్పాన్ని ప్రతిబింబించేలా ఆ మంచాన్ని తీర్చిదిద్దాడు. అద్భుత శిల్పకళానైపుణ్యానికి ప్రతీకగా ఉంది ఆ మంచం. దాని డిజైన్ చూస్తే ఎంతటివారైనా వావ్.. అనకుండా ఉండలేరు. అలా ఉంది మరి మానోడి ట్యాలెంట్..సేమ్ టూ సేమ్ చెక్కతో చేసిన మాదిరిగానే దాన్ని తీర్చి దిద్దాడు. నిజం చెప్పాలంటే చెక్కతో చేసిన దానికంటే అద్భుతంగా డిజైన్ చేశాడు. ఆ మంచాన్ని తయారు చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వీడియో చూసినా వారంతా అతని ట్యాటెంట్ కు హ్యాట్సాప్ అంటున్నారు. లక్షలు పెట్టి షాపింగ్ మాల్స్‌లో మంచాలు కొనే బదులు.. ఇంట్లోనే ఇలాంటి మంచాలు తయారు చేయించుకుంటే పర్మినెంట్‌గా పడి ఉంటాయనే అభిప్రాయానికి వస్తున్నారు. బయటపెట్టే డబ్బుల కంచే ఇలా కట్టించుకుంటే తక్కువ ఖర్చుతో పాటు బలంగా, ఆకర్షణీయంగా, విశాలంగా ఉంటాయని కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం
ఊబకాయులకు గుడ్ న్యూస్.. మార్కెట్లోకి బరువు తగ్గించే ఇంజక్షన్?
తోపులే జడుసుకున్నారు.. ఈ క్రూజ్ టూర్‌కి గుండె ధైర్యం ఉందా?వీడియో
పెళ్లి పీటలెక్కాల్సి ఉండగా.. మృత్యుఒడికి.. వీడియో
బెడ్‌రూమ్‌లో ఉండాల్సిన మంచం రోడ్డుపైకి వస్తే.. వీడియో

పామును బంధించేందుకు ప్రయత్నించిన స్నేక్ క్యాచర్‌కు ఝలక్..

వీర భక్తుడు అనుకునేరు.. అసలు విషయం వేరే..

ఊరందరికి స్నేహితుడిగా మారిన కొండముచ్చు.. వీడియో

జనావాసాల్లోకి సింహం.. కెన్యా పార్క్‌లో దారుణం.. వీడియో

గలీజుగా న్యూయార్క్ సబ్వే.? వీడియో

వాహనాలకు హారన్‌గా ఫ్లూట్, తబలా సంగీతం! వీడియో

ఆడ స్పైడర్‌ను ఆకర్షించేందుకు డ్యాన్స్పడిపోయిందా ఒకే..! లేదంటే
