Mad Movie Anthony: మ్యాడ్ సినిమాలో కనిపించిన యాంథోని ఎవరో తెలుసా..? మల్టీటాలెంటెడ్.. బ్యాగ్రౌండ్ తెలిస్తే..
ఏదైన రంగంలో టాలెంట్ ఉంటేనే ఆఫర్స్ వస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా సినీరంగంలో ప్రతిభతోపాటు కాసింత అదృష్టం ఉంటే అవకాశాలు క్యూ కట్టేస్తాయి. ఇప్పుడు మనం చెప్పబోయే నటుడు కూడా అలాంజి జాబితాలోకి చెందినవారే. అతడే యాంథోని. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు.

ఇటీవల సోషల్ మీడియాలో తెగ మారుమోగిన పేరు యాంథోని. గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన మ్యాడ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చిన మ్యాడ్ చిత్రం భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అలాగే ఇటీవల వచ్చిన ఈ మూవీ సీక్వెల్ సైతం సూపర్ హిట్ అయ్యింది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్స్ గా వచ్చిన ఈ సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ కామెడీ పంచులతో ప్రేక్షకులను ఫుల్ గా నవ్వించి పెద్ద హిట్టు కొట్టి భారీగా వసూళ్లు రాబట్టారు. ఇక మ్యాడ్ సినిమాతోపాటు సీక్వెల్ లోనూ యాంథోని పాత్రలో కడుపుబ్బా నవ్వించాడు ఓ నటుడు. యాంథోని.. అనగానే దేంతోని అంటూ వచ్చే డైలాగ్ నెట్టింట ఎంతగా పాపులర్ అయ్యిందో చెప్పక్కర్లేదు. అయితే యాంథోని నటుడే కాదు.. మల్టీటాలెంటెడ్ కూడా.. అతడి బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకవ్వాల్సిందే.
ఇటీవల నిర్వహించిన మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ ఈవెంట్లో ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ వేడుకలో తారక్ మాట్లాడుతూ యాంథోనిపై ప్రశంసలు కురిపించాడు. తాను సినిమాలో ఎప్పటికీ మర్చిపోలేని క్యారెక్టర్ అంటే యాంథోని అని.. కామెడీ క్యారెక్టర్ మాస్ ఎంట్రీగా చూపించారని అన్నారు. యాంథోని అసలు పేరు రవి. సినీ పరిశ్రమలో ఆర్ట్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ఆర్ట్ డైరెక్టర్ అయ్యాడు. ఆ తర్వాత పలు సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసి సిద్దూ జొన్నలగడ్డకు పరిచయమయ్యాడు. యాంథోనిలో మంచి రైటింగ్ స్కిల్స్ ఉండడం చూసి రైటర్ గా గుర్తించిన సిద్ధూ.. టిల్లు, టిల్లు స్క్వైర్ సినిమాలకు అవకాశం ఇచ్చాడు. ఇప్పటివరకు తెలుగులో ఏడు సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్, రైటర్, యాక్టర్ గా పనిచేశాడు సిద్దూ.
మ్యాడ్ సినిమా డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ గా బాగా జుట్టు ఉన్న ఒక క్యారెక్టర్ కావాల్సి రావడంతో అప్పటికే రవి తనకు ఫ్రెండ్ కావడంతో యాంథోని పాత్రకు తీసుకున్నారు. ఇక మ్యాడ్ సినిమాలో ఈ పాత్ర హైలెట్ అయ్యింది. దీంతో మ్యాడ్ స్కైర్ సినిమాలోనూ కంటిన్యూ చేశారు. మ్యాడ్ స్క్వైర్ సినిమా తర్వాత తెలుగులో మరిన్ని చిత్రాల్లో నటిస్తున్నాడు రవి. ప్రస్తుతం అతడు విశ్వక్ సేన్, అనుదీప్ కాంబోలో వస్తున్న ఫంకీ సినిమాలోనూ నటిస్తున్నాడు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
