Ram Charan : రామ్ చరణ్‌తో సత్య కామెడీ.. కాళ్లు పట్టుకోబోయిన గ్లోబల్ స్టార్.. వీడియో వైరల్..
ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ పెద్ది సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ మూవీ ఫస్ట్ షాట్ గ్లింప్స్ అంచనాలు ఒక్కసారిగా పెంచేసింది.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఉప్పెన సూపర్ హిట్ తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఈ మూవీ ఫస్ట్ షాట్ గ్లింప్స్ రిలీజ్ చేసి సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశారు మేకర్స్. ముఖ్యంగా ఇందులో రామ్ చరణ్ ఊర మాస్ లుక్, స్వాగ్, డైలాగ్స్ ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి. ముఖ్యంగా ఇందులో చరణ్ బ్యాటింగ్ క్లిప్ వేరేలెవల్. దీంతో పెద్ది సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయమంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఇదిలా ఉంటే.. తాజాగా రామ్ చరణ్ ను యాంకర్ ప్రదీప్, కమెడియన్ సత్య కలిశారు. ప్రదీప్ హీరోగా నటిస్తున్న అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ ప్రమోషన్లలో భాగంగా వీరిద్దరు చరణ్ ను కలిసినట్లుగా తెలుస్తోంది.
యాంకర్ ప్రదీప్, దీపికా పిల్లి జంటగా నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ఏప్రిల్ 11న థియేటర్లలో విడుదల కానుంది. కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇందులో భాగంగానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫస్ట్ టికెట్ కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోనూ చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. అందులో చరణ్ ను కలిసేందుకు ప్రదీప్ తోపాటు కమెడియన్ సత్య ఇద్దరూ వెళ్లారు. అక్కడ చరణ్ నాకు బాగా క్లోజ్ అని.. నేను ఎంత చెప్తే అంత అంటూ కమెడియన్ సత్య కాసేపు కామెడీ చేశారు. కానీ చరణ్ మాత్రం అసలు సత్య ఎవరో తనకు తెలియనట్టు.. పేరు కూడా గుర్తులేనట్టు ఆటపట్టించారు.
సత్యను కిషోర్ అంటూ ఆటపట్టించారు రామ్ చరణ్. ఆ తర్వాత సినిమా టికెట్ కొన్న చరణ్ కాళ్లకు నమస్కరించాడు సత్య. దీంతో చరణ్ సైతం కాళ్లు మొక్కెందుకు ప్రయత్నించగా.. సత్య వెంటనే పక్కకు జరిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. చరణ్ మంచి మనసు చూసి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. గ్లోబల్ స్టార్ అయ్యుండి ఎంత సింపుల్ గా ఉంటున్నారో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
