Chhaava OTT: ఓటీటీలోకి వస్తోన్న వీరుడి కథ.. ఛావా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..
ఇటీవల ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ వసూళ్లు రాబట్టిన సినిమా ఛావా. బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. తాజాగా స్ట్రీమింగ్ డేట్ అధికారికంగా ప్రకటించారు.

బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ ఛావా. ఎలాంటి అంచనాలు లేకుండా అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ ను కొల్లగొట్టేశాడు విక్కీ కౌశల్. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ సినిమాకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాలో క్లైమాక్స్ లో విక్కీ తన నటనతో అందరి గుండెల్ని మెలి పెట్టేసింది. ఈ సినిమా క్లైమాక్స్ చూసి ప్రతి ప్రేక్షకుడు ఎమోషనల్ అయ్యారు. ఇందులో శంభాజీ మహారాజ్ భార్య పాత్రలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించింది. ఈ చిత్రంలో వీరిద్దరి జోడికి అడియన్స్ ఫిదా అయ్యారు. హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమాను కాస్త ఆలస్యంగా తెలుగులో రిలీజ్ చేశారు.
ఇటు తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది. ఇక్కడ కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా విక్కీ కౌశల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రూ.700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వస్తున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 11 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయనున్నారట. ఏప్రిల్ 11 నుంచి అన్ని భాషలలో ఈ సినిమా అందుబాటులోకి రానుందని సమాచారం. ఈ మేరకు నెట్ ఫ్లిక్స్ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఇన్నాళ్లు థియేటర్లలో సత్తా చాటిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో ఏ రేంజ్ లో దూసుకుపోతుందో చూడాలి.
కథ విషయానికి వస్తే.. ఛత్రపతి శివాజీ మరణం తర్వాత మరాఠా సామ్రాజ్యం బలహీనపడిందని.. ఇక ఆ ప్రాంతాన్ని దక్కించుకోవడం..పాలించడం సులభమవుతుందని మొగల్ చక్రవర్తి ఔరంగజేబు భావిస్తాడు. కానీ వారి ఆలోచనలకు ప్రతిబంధకంగా మారతాడు ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్. మొగల్ సేనను శంభాజీ మహారాజ్ ఎలా ఎదుర్కొన్నాడు.. ? ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి.. ? శంభాజీ మహారాజ్ కు ద్రోహం చేసిందెవరు ? అనేది సినిమా. ఇందులో విక్కీ కౌశల్ అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రసంశలు అందుకున్నాడు.
Aale Raje aale 👑 Witness a tale of courage and glory etched in time 🔥⚔️
Watch Chhaava, out 11 April on Netflix. #ChhaavaOnNetflix pic.twitter.com/6BJIomdfzd
— Netflix India (@NetflixIndia) April 10, 2025
ఇవి కూడా చదవండి :



