సాయంత్రం 6 దాటాక ఇవి తిన్నారో మీ ఆరోగ్యం పని అయిపోయినట్లే.. తినేముందు తప్పక తెలుసుకోండి..
సాయంత్రం 6 తర్వాత కొన్ని ఆహారాలు జీర్ణక్రియను దెబ్బతీసి, బరువును పెంచుతాయి. సమోసాలు, పకోడీలు, జంక్ ఫుడ్, స్వీట్లు అధిక కొవ్వు, చక్కెరను కలిగి డయాబెటిస్ ముప్పును పెంచుతాయి. వాటికి బదులుగా తీసుకోవాల్సిన ఆరోగ్యకరమైన స్నాక్స్ ఏంటీ అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

సాయంత్రం కాగానే చల్లని వాతావరణంలో వేడివేడిగా ఏదైనా తినాలనిపించడం సహజం. ముఖ్యంగా చలికాలం, వర్షాకాలంలో సమోసాలు, పకోడీలు, బజ్జీల మీదకు మనసు మళ్లుతుంది. అయితే సాయంత్రం 6 గంటల తర్వాత మీరు తీసుకునే ఆహారమే మీ జీర్ణక్రియను, జీవక్రియను తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఒకసారి చూద్దాం..
సాయంత్రం 6 తర్వాత వీటిని దూరం పెట్టండి
రుచి కోసం మనం తినే కొన్ని పదార్థాలు శరీరంలో కొవ్వును, చక్కెర స్థాయిలను అకస్మాత్తుగా పెంచుతాయి. ముఖ్యంగా ఈ ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది..
వేయించిన పదార్థాలు: సమోసాలు, వేయించిన మోమోలు, పకోడీలు.
జంక్ ఫుడ్: వెన్న ఎక్కువగా ఉండే బర్గర్లు, పిజ్జాలు.
స్వీట్లు: జిలేబీలు మరియు అధిక చక్కెర కలిగిన ఇతర స్వీట్లు.
స్ట్రీట్ ఫుడ్: పానీపురి వంటి మసాలా ఆహారాలు.
ఎందుకు తినకూడదు?
వేయించిన ఆహారాలకు, టైప్-2 డయాబెటిస్‌కు ప్రత్యక్ష సంబంధం ఉంది. ఇవి ఇన్సులిన్ నిరోధకతను పెంచి రక్తంలో చక్కెర స్థాయిలను అస్తవ్యస్తం చేస్తాయి. రాత్రి వేళల్లో జీర్ణక్రియ మందగిస్తుంది. ఈ సమయంలో భారీ ఆహారం తీసుకోవడం వల్ల గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. నూనెలో వేయించిన పదార్థాలు పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను తగ్గించి, వాపును పెంచుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. వీటిలో కేలరీలు అధికంగా ఉండటం వల్ల శరీరంలో కొవ్వు వేగంగా పేరుకుపోతుంది.
సాయంత్రం పూట ఆరోగ్యకరమైన స్నాక్స్ ఏవి?
వేయించిన స్నాక్స్‌కు బదులుగా కడుపుకు తేలికగా ఉండే, పోషక విలువలు కలిగిన ఈ క్రింది ఆహారాలను ఎంచుకోవచ్చు:
- నూనె లేకుండా వేయించిన మఖానా ఆరోగ్యానికి మంచిది.
- ఉడికించిన స్వీట్ కార్న్.
- వేడివేడి వెజిటబుల్ సూప్.
- నూనె తక్కువగా ఉన్న పనీర్ లేదా మసాలా శనగలు.
- మైదాతో కాకుండా గోధుమపిండితో చేసిన ఉడికించిన మోమోలు.
మనం ఏం తింటామో అదే మన ఆరోగ్యం అన్నది పెద్దల మాట. ముఖ్యంగా సాయంత్రం 6 గంటల తర్వాత తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటిస్తే.. బరువు అదుపులో ఉండటమే కాకుండా రాత్రిపూట ప్రశాంతమైన నిద్ర పడుతుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




