Weight Loss Tips: జిమ్‌కి వెళ్లకుండానే ఇంట్లోనే సులువుగా బరువుతగ్గొచ్చు..? ఎలాగంటే..
నేటి బిజీగా జీవనశైలిలో అధిక బరువు ప్రతి ఒక్కరినీ కలవర పెడుతుంది. బరువు తగ్గడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గడం లేదు. ఇలాంటి సందర్భంలో సులువుగా బరువు తగ్గడానికి కొన్ని చిట్కాలను పాటించడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. కొంత మంది బరువు తగ్గడానికి ఎంత ప్రయత్నించినా..

సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య రాత్రి భోజనం చేయడం మంచిది. ఆ తర్వాత ఏమీ తినకూడదు. ఈ సమయంలో తేలికపాటి భోజనం తినడంపై దృష్టి పెట్టండి. అంటే ఓట్స్, గంజి, కిచిడి, సలాడ్ వంటివి తినాలన్నమాట.
- కొంత మంది బరువు తగ్గడానికి ఎంత ప్రయత్నించినా బరువు తగ్గడానికి బదులు మరింత పెరుగుతుంటారు. మీకూ ఇలా జరుగుతుందా? అయితే మీరు సులువుగా బరువు తగ్గాలనుకుంటే ఈ చిట్కాలను అనుసరించండి.
- బరువు తగ్గడానికి అతి ముఖ్యమైన విషయం మీరు తీసుకునే ఆహారం. మీరు ఏం తింటున్నారనే దానిపై మీ బరువు ఆధారపడి ఉంటుంది. మీరూ బరువు తగ్గాలనుకుంటే రోజుకు రెండుసార్లు మాత్రమే తినడం అలవాటు చేసుకోండి.
- మధ్యాహ్నం 12 నుంచి 1 గంటల మధ్య తినడం మంచిది. మీరు ఉదయం అల్పాహారం తీసుకోవచ్చు. పోహా, ఉప్మా, చిల్లా, టిక్కీ వంటి వాటిని తినండి.
- మధ్యాహ్న భోజనంలో చపాతీ, కూరగాయలు, పప్పు ధాన్యాలు వంటివి తినండి. వీలైనంత ఎక్కువ సలాడ్ తినడానికి ప్రయత్నించండి. భోజనానికి ముందు సలాడ్ తినడం వల్ల ఎక్కువగా భోజనం తినకుండానే కడుపునిండిన అనుభూతి కలుగుతుంది.
- సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య రాత్రి భోజనం చేయడం మంచిది. ఆ తర్వాత ఏమీ తినకూడదు. ఈ సమయంలో తేలికపాటి భోజనం తినడంపై దృష్టి పెట్టండి. అంటే ఓట్స్, గంజి, కిచిడి, సలాడ్ వంటివి తినాలన్నమాట.





