AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: కామాంధుడి కథ ముగిసింది.. మరికొందరి పాత్రపై ఆరా తీస్తున్న పోలీసులు..

అదృశ్యం, అత్యాచారం, హత్య ఆపై నిందితుడి ఆత్మహత్య.. మొత్తం 24 గంటల్లోనే అంతా జరిగిపోయింది. కామాంథుడి కథ ముగిసిపోయింది. మదనపల్లి బాలికపై అత్యాచారం కేసులో తక్షణ న్యాయం జరిగింది. హత్య చేసిన నిందితుడు చెరువులో శవమైన తేలగా డెడ్ బాడీని చూసేందుకు కూడా తల్లి రాని పరిస్థితి నెలకొంది.

Andhra: కామాంధుడి కథ ముగిసింది.. మరికొందరి పాత్రపై ఆరా తీస్తున్న పోలీసులు..
Madanapalli Incident
Raju M P R
| Edited By: |

Updated on: Feb 19, 2026 | 9:01 AM

Share

అదృశ్యం, అత్యాచారం, హత్య ఆపై నిందితుడి ఆత్మహత్య.. మొత్తం 24 గంటల్లోనే అంతా జరిగిపోయింది. కామాంథుడి కథ ముగిసిపోయింది. మదనపల్లి బాలికపై అత్యాచారం కేసులో తక్షణ న్యాయం జరిగింది. హత్య చేసిన నిందితుడు చెరువులో శవమైన తేలగా డెడ్ బాడీని చూసేందుకు కూడా తల్లి రాని పరిస్థితి నెలకొంది. మరోవైవు కులవర్ధన్ స్నేహితులు, తల్లి పాత్రపైనా అనుమానాలు వ్యక్తం అవుతుండటంతో పోలీసుల దర్యాప్తు అన్ని కోణాల్లో కొనసాగుతోంది. అసలు పిక్చర్ ఏంటో తెల్చే పనిలో ఉన్న పోలీసు యంత్రాంగం.. నిన్నటి ఉద్రిక్తతకు దారి తీసిన పరిస్థితులు, కారణాలు, కారకుల కోసం అన్వేషిస్తుంది.

24 గంటలల్లోనే శవమైన నిందితుడు..

అన్నమయ్య జిల్లాలో సంచలనం రేకెత్తించిన మైనర్ బాలిక రేప్ అండ్ మర్డర్ కేస్ ఎన్నో మలుపులు తిరిగింది. 24 గంటల సమయంలోనే నిందితుడు శవమై కనిపించడం కలకలం రేపింది. ఈనెల 16 న సాయంత్రం 4 గంటల సమయంలో మైనర్ బాలిక అదృశ్యం కావడం.. 17 న ఉదయం హత్యకు గురై నిందితుడి ఇంటిలో ఉన్న నీటి డ్రమ్ములో శవమై తేలడం.. నిందితుడు కులవర్ధన్ ను తమకు అప్పగించాలంటూ 10 గంటలకు పైగా స్థానికులు ఆందోళన చేయడం లాంటి ట్విస్ట్ లు నెలకొన్నాయి. గంటల తరబడి హైడ్రామా కూడా నడిచింది. నిన్న రాత్రి మైనర్ బాలిక డెడ్ బాడీకి పోస్టు మార్టం నిర్వహించడం, అంత్యక్రియలు పూర్తి చేయడం జరిగిపోయింది. అయితే, మైనర్ బాలిక అంత్య క్రియలు పూర్తయ్యేలోపే ఉదయమే మరో ట్విస్ట్ తెర మీదకు వచ్చింది.

కురబల కోట మండలం మైనర్ బాలిక మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్న కుల వర్ధన్ కలసానివారిపల్లి చెరువులో గుర్తు తెలియని యువకుడి మృతదేహంగా ఆచూకీ లభించింది. కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడని అన్నమయ్య జిల్లా ఎస్పీ కూడా నిర్ధారించారు. స్థానికుల నుంచి కులవర్ధన్ ను రక్షించే ప్రయత్నంలో అదుపులోకి తీసుకొని రక్షక్ వాహనంలో తరలిస్తుండగా తప్పించుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్పీ ధీరజ్ మీడియాకు వివరించారు. పోలీసుల నుంచి తప్పించుకున్న కులవర్ధన్ కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తుండగా చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుసుకున్నామని ఎస్పీ ధీరజ్ తెలిపారు..

కామాంధుడి కథ ముగిసింది.. మరికొందరి పాత్రపై ఆరా తీస్తున్న పోలీసులు..

ఇక ఆత్మహత్యతో శవమై దొరికిన నిందితుడు కులవర్ధన్ డెడ్ బాడీ పోస్టుమార్టం పై సస్పెన్స్ కొనసాగింది. కులవర్ధన్ తల్లి, బంధువులెవరు ముందుకు రాకపోవడంతో పోస్టుమార్టం ఆలస్యమైంది. మైనర్ బాలిక అంత్యక్రియలు జరగకముందే నిందితుడు ఉదయమే శవమై దొరికినా శవపరీక్ష చేయడానికి మాత్రం పోలీసులకు ఛాలెంజ్‌గా మారింది. తల్లి అంజలి కొడుకు కులవర్ధన్ డెడ్ బాడీని చూసేందుకు, తీసుకునేందుకు ముందుకు రాలేదు.. దీంతో పోస్టుమార్టం పూర్తయ్యాక కులవర్ధన్ డెడ్ బాడీని మార్చురీలోనే పోలీసులు ఉంచాల్సి వచ్చింది.

కురబల కోట వీఆర్వో సుస్మిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇప్పుడు మైనర్ బాలిక హత్య, నిందితుడి ఆత్మహత్య కేసుల్లో పురోగతి సాధించగా.. ఇప్పుడు మరో కోణంలో దర్యాప్తు షురూ చేశారు. మైనర్ బాలిక మర్డర్ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఉద్రిక్తతకు దారి తీసిన పరిస్థితులు, కారకులతోపాటు కులవర్ధన్ తల్లి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. దీనిలో ఎవరి పాత్ర ఎంత..? ఏంటి..? అనే తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు. ఇంత గొడవకు కారణం.. ఇందులో ఎవరి నిర్లక్ష్యం ఉందో తెల్చే పనిలో ఉన్న పోలీస్ అధికారులు అందరినీ విచారించేందుకు సిద్ధమయ్యారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us