టీ తాగిన వెంటనే నీళ్లు తాగితే పళ్లు ఊడిపోతాయంటారు.. నిజమేనా?

Samatha

18 February 2026

టీ తాగడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చాలా మంది ఎంతో ఇష్టంగా ప్రతి రోజూ ఉదయం లేచిన వెంటనే కప్పు టీ తాగుతుంటారు.

టీ

ఇక కొందరు రోజుకు ఒకసారి టీ తాగితే మరికొంత మంది రోజుకు రెండు లేదా మూడు సార్లు టీ తాగుతుంటారు. టీ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ అతిగా తాగడం మంచిది కాదు.

ఆరోగ్యానికి మంచిది

అయితే టీ తాగిన వెంటనే నీళ్లు తాగకూడదు అని కొందరు అంటారు. కానీ పెద్ద వాళ్లు మాత్రం  టీ తాగిన వెంటనే నీళ్లు తాగితే పళ్లు ఊడిపోతాయని అంటారు.

పళ్లు ఊడిపోవడం

మరి టీ తాగిన వెంటనే నీళ్లు తాగితే నిజంగానే పళ్లు ఊడిపోతాయా? అసలు దీని గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

నీళ్లు తాగకూడదా?

టీలలో అనేక రకాలు ఉంటాయి. ముఖ్యంగా గ్రీన్ టీ, బ్లాక్ టీలలో అమైనో ఆమ్లాలు, విటమిన్స్, క్యాటికిన్లు అనే ధాతువులు ఎక్కువగా ఉంటాయి.

టీలలో అనేక రకాలు

క్యాన్సర్ నిరోధానికి, ఊబకాయం నివారించడానికి టీ చాలా మంచిది. కానీ, మనం తాగే టీ పొడుల్లో కెఫిన్‌తో పాటు, ఫ్లోరడ్ ఎక్కువగా ఉంటుందంట. అందుకే టీ అతిగా తీసుకోకూడదటారు.

క్యాన్సర్ నిరోధకం

ముఖ్యంగా టీ పొడుల్లో పళ్లకు గార పట్టించే టానిన్ పదార్థం ఉంటుంది. దీని వలన కొన్ని సార్లు టీ అధికంగా తాగితే పళ్లు పసుపు రంగులోకి మారడం వంటిది జరుగుతుంది.

పళ్లపై గాట్లు

అయితే చాలా మంది టీ తాగిన వంటనే నీళ్లు తాగితే పళ్లు ఊడిపోతాయి అంటారు. కానీ ఇందులో నిజం లేదంటున్నారు నిపుణులు. టీ తాగిన వెంటనే నీళ్లు పుక్కిలించడం వలన పళ్లపై మరకలు ఏర్పడకుండా ఉంటుంది. కానీ పళ్లు ఊడిపోవంట.

పళ్లు ఊడిపోవు