ఎర్రెర్రని స్ట్రాబెర్రీలు తింటే.. క్యాన్సర్‌ సహా ఎన్నో రోగాలు పరార్‌!

18 February 2026

TV9 Telugu

TV9 Telugu

ఎర్రని ఎరుపు రంగులో హృదయాకారంలో కొంచెం పుల్లగా కొంచెం తియ్యగా చూసేందుకు మరింత ఆకర్షణీయంగా ఉండే స్ట్రాబెర్రీలు ఈ కాలంలో మాత్రమే దొరుకుతాయి

TV9 Telugu

అందంగా కనించడమే కాదు ఆరోగ్యానికి కూడా స్ట్రాబెర్రీలు ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో విట‌మిన్ సి, మాంగ‌నీస్, ఫోలేట్, పొటాషియం వంటి పోష‌కాల‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబ‌ర్ కూడా పుష్కలంగా ఉంటాయి

TV9 Telugu

ఆక్సీక‌ర‌ణ ఒత్తిడిని త‌గ్గించ‌డంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, మెద‌డు పనితీరును పెంచ‌డంలో, జీర్ణక్రియ‌కు ఇలా అనేక ర‌కాలుగా స్ట్రాబెర్రీలు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి

TV9 Telugu

స్ట్రాబెర్రీల్లో విట‌మిన్ సి, ఆంథోసైనిన్లు, ఎలాజిక్ ఆమ్లం వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ‌గా ఉంటాయి. ఇవి శ‌రీరానికి ఫ్రీరాడికల్స్ వ‌ల్ల క‌లిగే న‌ష్టాన్ని త‌గ్గిస్తాయి. దీంతో గుండె జ‌బ్బులు, క్యాన్సర్, మ‌ధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు వ‌చ్చే అవ‌కాశం త‌క్కువ‌ట

TV9 Telugu

స్ట్రాబెర్రీల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఇన్పెక్షన్‌ల‌తో పోరాడే సామ‌ర్థ్యం పెరుగుతుంది. స్ట్రాబెర్రీల్లో ఫైబ‌ర్, ఫ్లేవనాయిడ్లు, పొటాషియం వంటి పోష‌కాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి

TV9 Telugu

ర‌క్తపోటు అదుపులో ఉంటుంది. గుండె జ‌బ్బుల ప్రమాదం త‌గ్గుతుంది. అంతేకాదు స్ట్రాబెర్రీల్లో మెద‌డు ఆరోగ్యాన్ని మెరుగుప‌రిచే స‌మ్మేళ‌నాలు ఉన్నాయి. ఇవి మెద‌డు ఆక్సీక‌ర‌ణ ఒత్తిడిని త‌గ్గించి ఫ్రీరాడికల్స్ వ‌ల్ల మెద‌డు క‌ణాలు దెబ్బతిన‌కుండా కాపాడుతాయి

TV9 Telugu

అభిజ్ఞా క్షీణ‌త ప్రమాదం త‌గ్గుతుంది. దీర్ఘకాలిక మెద‌డు సంబంధిత స‌మ‌స్యలు వ‌చ్చే అవ‌కాశాలు కూడా త‌గ్గుతాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని కూడా మెరుగుప‌రుస్తాయి. వ‌య‌సు పైబ‌డ‌డం వ‌ల్ల వ‌చ్చే దృష్టి సంబంధిత స‌మస్యలు నివారించవచ్చు

TV9 Telugu

స్ట్రాబెర్రీల్లో క్యాల‌రీలు త‌క్కువ‌గా, ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది. క‌నుక వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. కాబట్టి శరీర బ‌రువు తగ్గేందుకు ప్రయత్నించేవారు వీటిని ఆహారంలో తీసుకోవడం వల్ల బరువు అదుపులో ఉంటుంది