ఉదయం నిద్ర నుంచి మేల్కోని కళ్లు తెరచిన వెంటనే మనసులో మెదిలే తొలి జ్ఞాపకం ఘుమఘుమలాడే కమ్మని కాఫీ. కప్పు కాఫీ ఖాళీ చేస్తే గానీ మనలో చాలా మందికి రోజు ప్రారంభంకాదు
TV9 Telugu
కాఫీని ఇష్టంగా తాగేవారికి దాని గొప్ప రుచి మాత్రమే కాదు దాని ఉత్తేజపరిచే ప్రభావాలు మరింత ఇష్టపడేలా చేస్తుంది. కాఫీ తక్షణ శక్తిని ఇవ్వడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది
TV9 Telugu
కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు పాలీఫినాల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది
TV9 Telugu
అయితే కాఫీని తీసుకునే విషయంలో చాలా మంది కొన్ని తప్పులు చేస్తుంటారు. దీని వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడతాయి. ముఖ్యంగా కాఫీలో చక్కెర అస్సలు కలపకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది రుచిగా ఉన్నప్పటికీ చక్కెర రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది
TV9 Telugu
చక్కెరకు బదులుగా కాఫీ కొద్దిగా చల్లారిన తరువాత అందులో తేనె కలిపి తీసుకోవచ్చు. అలాగే మాంక్ ఫ్రూట్, స్టీవియాను కూడా కలపొచ్చు. కాఫీ పంటకు పురుగు మందులు ఎక్కువగా వినియోగిస్తారు. ఇలాంటివి ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. కనుక అధిక సేంద్రీయ నాణ్యత కలిగిన కాఫీని మాత్రమే తీసుకోవాలి
TV9 Telugu
యాసిడ్ రిఫ్లెక్స్ ఉన్న వారు తేలికపాటి రోస్ట్ కలిగిన కాఫీని తీసుకోవడం వల్ల లక్షణాలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఇలాంటి వారు ముదురు రంగు రోస్ట్ కలిగిన కాఫీగింజలను తీసుకోవడం మంచిది
TV9 Telugu
కాఫీలో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. దీనిని అధికంగా తీసుకోవడం వల్ల చికాకు, నిద్ర సమస్యలు, అధిక రక్తపోటు, జీర్ణ సమస్యలు వస్తాయి. కనుక కాఫీని తక్కువ మోతాదులో తీసుకోవాలి. రోజుకు 400 మిల్లీగ్రాముల కెఫిన్ తీసుకుంటే సరిపోతుంది
TV9 Telugu
అలాగే కాఫీని సాయంత్రం వేళల్లో తీసుకోకూడదు. ఇలా తీసుకోవడం వల్ల నిద్రకు ఆటంకం కలుగుతుంది. కనుక కాఫీని ఎల్లప్పుడూ ఉదయం లేదా మధ్యాహ్నం సమయాల్లో మాత్రమే తీసుకోవాలి