AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్క గ్లాస్ చాలు.. బరువు తగ్గడానికి, డయాబెటిక్ రోగులకు సూపర్‌ఫుడ్.. చిటికెలో రెడీ చేసుకోవచ్చు..

బరువు తగ్గాలనుకునేవారికి, డయాబెటిక్ రోగులకు, ఇతర హార్మోనల్ సమస్యలు ఉన్నవారికి జొన్న జావా ఒక అద్భుతమైన ఎంపిక.. ఎన్నో పోషకాలున్న ఈ సులభమైన వంటకం కేవలం 10-15 నిమిషాల్లో సిద్ధమవుతుంది. జొన్నపిండితో తయారుచేసే ఈ జావా, పెరుగుతో కలిపి తీసుకోవడం ద్వారా పోషక విలువలతో పాటు రుచిని కూడా అందిస్తుంది.

ఒక్క గ్లాస్ చాలు.. బరువు తగ్గడానికి, డయాబెటిక్ రోగులకు సూపర్‌ఫుడ్.. చిటికెలో రెడీ చేసుకోవచ్చు..
Jonna Java
Shaik Madar Saheb
|

Updated on: Feb 19, 2026 | 9:21 AM

Share

ఆరోగ్యకరమైన జీవనశైలిని కోరుకునేవారికి, ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి, డయాబెటిక్ ఉన్నవారికి.. జొన్న జావ ఒక అద్భుతమైన పౌష్టిక ఆహారం అని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారంగా నిలుస్తుందని ప్రతిఒక్కరూ దీనిని సులభంగా తీసుకోవచ్చని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు.. జొన్నలు (Sorghum) గ్లూటెన్ రహిత, పోషకాలతో కూడిన అద్భుతమైన చిరుధాన్యం.. వీటిలో ఫైబర్, ప్రోటీన్, ఐరన్, మెగ్నీషియం, బి-విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడం, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడం, గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడం, బరువు తగ్గడం, బలమైన ఎముకలకు సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

జొన్న జావ – ప్రయోజనాలు

ఈ జొన్న జావా రెసిపీని ఎవరైనా, ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా చేసుకోని తాగవచ్చు. డయాబెటిస్, ప్రీ-డయాబెటిస్, అధిక బరువు, థైరాయిడ్, పీసీఓడీ, పీసీఓఎస్ వంటి హార్మోనల్ అసమతుల్యతలు ఉన్నవారు కూడా దీనిని నిస్సందేహంగా తీసుకోవచ్చు. రాగులు విషయంలో మాత్రం థైరాయిడ్ సమస్య ఉన్నవారు వారానికి ఒకసారి మాత్రమే తీసుకోవాలి.. కానీ.. మిగిలిన మిల్లెట్స్‌ను హాయిగా వినియోగించుకోవచ్చు. రొట్టెలు చేయడానికి సమయం లేనివారికి ఇది చాలా మంచి ఎంపిక.. ఎందుకంటే ఇది జొన్నలు తిన్నంత ప్రయోజనాన్ని అందిస్తుంది.

జొన్న తయారీ విధానం..

జొన్న జావా తయారీ చాలా సులువు. మొదట, రెండు చెంచాల జొన్నపిండిని ఉండలు కట్టకుండా నీటితో కలపాలి. ఒక గిన్నెలో తగినంత నీటిని తీసుకుని మరిగించాలి. నీరు మరిగేటప్పుడు, రుచికి సరిపడా ఉప్పు వేసి, ముందుగా కలిపి పెట్టుకున్న జొన్నపిండి మిశ్రమాన్ని నెమ్మదిగా పోస్తూ, ఉండలు కట్టకుండా కలియబెట్టాలి. దీనిని బాగా ఉడికించి, మనకు కావలసిన చిక్కదనం వచ్చేవరకు చూసుకోవాలి. కొంతమంది పలుచగా, మరికొందరు చిక్కగా ఇష్టపడతారు. ఉడికిన తర్వాత, దీనిని ఒక బౌల్‌లోకి తీసుకుని, పల్చటి మజ్జిగ లేదా పెరుగుతో కలుపుకోవచ్చు. రుచి కోసం బెల్లం వేసుకోవచ్చు.

వీలైతే తాలింపు కూడా వేసుకోవచ్చు.. తాలింపు కోసం, తక్కువ నూనెలో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించి, దానిని జావలో కలుపుకోవాలి. మట్టి కుండలో తయారుచేస్తే మరింత రుచిగా ఉంటుంది..

బరువు తగ్గే ప్రయాణంలో వ్యాయామం, నడక లేదా యోగా సాధనతో పాటు సమతుల్య ఆహారం తీసుకోవడం తప్పనిసరి. ఆహారంలో వైవిధ్యాన్ని పాటించడం ద్వారా అన్ని పోషకాలను పొందవచ్చు. ఒకరోజు జొన్నలతో, మరో రోజు సజ్జలతో, ఇంకో రోజు రాగులతో లేదా ఇతర మిల్లెట్స్‌తో జావా చేసుకోని తాగవచ్చు..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
గుండెనే కాదు, మీ మెదడును కూడా నాశనం చేసే ఆ అలవాటు ఏంటో తెలుసా?
గుండెనే కాదు, మీ మెదడును కూడా నాశనం చేసే ఆ అలవాటు ఏంటో తెలుసా?
మండుతున్న గ్యాస్ ధరలు.. సిలిండర్ ఆదా చేసే చిట్కాలు ఫాలో అయ్యారంటే
మండుతున్న గ్యాస్ ధరలు.. సిలిండర్ ఆదా చేసే చిట్కాలు ఫాలో అయ్యారంటే
హమ్మయ్య.. గ్యాస్ సిలిండర్ల కొరతపై కేంద్రం కీలక ప్రకటన..
హమ్మయ్య.. గ్యాస్ సిలిండర్ల కొరతపై కేంద్రం కీలక ప్రకటన..
గాడ్‌ఫాదర్ సినిమా చేయలేనని ఓపెన్‌గా చెప్పేశా..
గాడ్‌ఫాదర్ సినిమా చేయలేనని ఓపెన్‌గా చెప్పేశా..
గ్యాస్ కొరత వేళ కేంద్రం ఊహించని షాక్.. ఒక్కొ కుటుంబానికి నెలకు..
గ్యాస్ కొరత వేళ కేంద్రం ఊహించని షాక్.. ఒక్కొ కుటుంబానికి నెలకు..
300 మిలియన్ల వ్యూస్‌తో సంచలనం.. ఓటీటీని షేక్ చేస్తోన్న థ్రిల్లర్
300 మిలియన్ల వ్యూస్‌తో సంచలనం.. ఓటీటీని షేక్ చేస్తోన్న థ్రిల్లర్
శ్రీదేవిని తీసేస్తేనే సినిమా కొంటామని అన్నారు..
శ్రీదేవిని తీసేస్తేనే సినిమా కొంటామని అన్నారు..
ఇడ్లీ తిని బోర్ కొడుతోందా?.. ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు..
ఇడ్లీ తిని బోర్ కొడుతోందా?.. ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు..
క్రెడిట్ కార్డ్ రూల్స్ మారుతున్నాయ్.. ఇవి తెలుసుకోకపోతే..
క్రెడిట్ కార్డ్ రూల్స్ మారుతున్నాయ్.. ఇవి తెలుసుకోకపోతే..
ఆ రాత్రి వేణుమాధవ్ రూమ్‌లో నిద్రపోయిన షకీలా.. ఆయన ఇలా అడిగాడు
ఆ రాత్రి వేణుమాధవ్ రూమ్‌లో నిద్రపోయిన షకీలా.. ఆయన ఇలా అడిగాడు