41 ఏళ్లలోనూ అదే అందం.. కవ్విస్తున్న క్రేజీ బ్యూటీ ప్రియమణి 

29 December 2025

Pic credit - Instagram

Rajeev 

ప్రియమణి.. హీరోయిన్ గా రాణించిన ప్రియమణి ఇప్పుడు సినిమాల స్పీడ్ తగ్గించేశారు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. 

యంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు అందరి సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంటూ దూసుకుపోతుంది. 

తెలుగుతో పాటు తమిళ్, హిందీలోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు ప్రియామణి. 

తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ అమ్మడు. 2007లో తమిళ చిత్రం పరుత్తివీరన్‌లో ఉత్తమ నటిగా జాతీయ అవార్డును గెలుచుకుంది. 

మణిరత్నం దర్శకత్వం వహించిన రావణ్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ సినిమా అంతగా విజయం సాధించలేదు.

షారుక్ ఖాన్ నటించిన చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో అదరగొట్టింది ఈ బ్యూటీ. అలాగే జవాన్ సినిమాలోనూ నటించింది. 

ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించిన ప్రియమణి.. సోషల్ మీడియాతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. క్రేజీ ఫోటోలు షేర్ చేస్తుంది.