మృణాల్ స్పీడ్‌కు బ్రేకులు పడ్డాయా..? డెకాయిట్‌తో ఫామ్ లోకి వస్తుందా.?

30 December 2025

Pic credit - Instagram

Rajeev 

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ లోకి దూసుకొచ్చింది అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. 

తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. సీతారామం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది మృణాల్. 

ఆ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సీతారామం సినిమా తర్వాత వచ్చిన హాయ్ నాన్న సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. 

నాని నటించిన హాయ్ నాన్న సినిమా హిట్ అవ్వడంతో విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఛాన్స్ కొట్టేసింది. 

ఫ్యామిలీ స్టార్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దాంతో మృణాల్ ఠాకూర్ స్పీడ్ కు బ్రేకులు పడ్డాయి.

చాలా రోజుల తర్వాత కల్కి సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది మృణాల్. ఆతర్వాత సైలెంట్ అయ్యింది. 

ఇక ఇప్పుడు డెకాయిట్ లో నటిస్తుంది. అడవి శేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.