30 December 2025

సాయంత్రం 7 లోపు భోజనం చేస్తాను.. అదితి ఫిట్‌నెస్ రహస్యం ఇదేనట..

Rajitha Chanti

Pic credit - Instagram

అదితి రావు హైదరి.. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషలలో వరుస సినిమాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్. యూత్ ఫేవరేట్ ముద్దుగుమ్మ.

 తాజాగా తన ఫిట్‌నెస్ రహస్యం చెప్పుకొచ్చింది. తాను సాయంత్రం 7.30 గంటల లోపు భోజనం పూర్తి చేస్తానని.. అలా చేయడం ఆరోగ్యానికి మంచిదని తెలిపింది.

తేలికైన ఆహారం తీసుకుంటానని.. చేపలు, రొయ్యల వంటి ఆహారాన్ని ఎక్కువగా తింటానని తెలిపింది. అలాగే ప్రతి రోజూ యోగా చేయడం తనకు చాలా ఇష్టమట.

ఫిట్ గా ఉండేందుకు యోగాతోపాటు డ్యాన్స్ చేస్తానని.. ప్రతి రోజూ డ్యాన్స్ చేయకపోయినప్పటికీ శరీరానికి అవసరమైన వ్యాయామాలు చేస్తానని అంటుంది అదితి.

అయితే రోజూ ఒకే రకమైన వ్యాయామాలు చేయడం తనకు అసలు ఇష్టం ఉండదని.. ప్రతిరోజూ కొత్త కొత్త వ్యాయామాలు చేస్తూ శరీరాన్ని యాక్టివ్ చేస్తుంటానని అంటుంది.

అలాగే చేపలతోపాటు.. కూరగాయలతో చేసిన ఫుడ్ తీసుకుంటుంది. ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారానికి దూరంగా ఉంటానని.. డైట్ విషయంలో జాగ్రత్తగా ఉంటుందట. 

ఎప్పుడూ పాజిటివ్ థింకింగ్.. శరీరానికి, మనసుకు అవసరమైన విశ్రాంతి ఇవ్వడమే తన అందం రహాస్యం అంటుంది అదితి. ఇప్పుడు ఈ అమ్మడు సినిమాలు తగ్గించింది.

ఇటీవలే హీరో సిద్ధార్థ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అదితి చివరిసారిగా హీరామండి సిరీస్ చేసింది. ఇందులో ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది.