రూ.4500 కోట్లు రాబట్టిన ఏకైక హీరోయిన్.. ఇప్పటికీ తగ్గని డిమాండ్..
Rajitha Chanti
Pic credit - Instagram
ఇప్పుడు ఓ హీరోయిన్ పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతుంది. మొత్తం 6 సినిమాలకు రూ.4500 కోట్లు వసూలు చేసి తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.
ఆమె పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో మారుమోగుతుంది. తక్కువ సమంయలోనే అందరి హృదయాల్లో చోటు సంపాదిచుకుంది. ఆమె మరెవరో కాదు రష్మిక మందన్నా.
2016లో రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన రక్షిత్ శెట్టి నటించిన కిరిక్ పార్టీ సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.
గీత గోవిందం మూవీతో హిట్టు అందుకున్న రష్మిక.. ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో సత్తా చాటుతుంది. ప్రస్తుతం ఆమె మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా హీరోయిన్.
పుష్ప 1, 2, యానిమల్, ఛావా, కుబేర, థామా, ది గర్ల్ ఫ్రెండ్ ఇలా వరుసగా ఘన విజయాలను అందుకుంటుంది. ఇటీవలే ఆమె నటించిన సినిమాలు కోట్లు రాబట్టాయి.
పుష్ప రూ.400 కోట్లు వసూలు రాబట్టింది. తర్వాత వరిసు రూ.300 వసూలు చేసింది. యానిమల్ సినిమా రూ.900 కోట్లు, పుష్ప 1800 కోట్లు వసూలు చేసింది.
ఇటీవల ఛావా సినిమాతో రూ.800 కోట్లు, కుబేర సినిమా రూ.140 కోట్లు వసూలు చేశాయి. దీంతో 4 సంవత్సరాలలో 6 సినిమాలతో రూ.4500 కోట్లు రాబట్టింది.
ఇప్పుడు కాక్ టెయిల్, మైసా చిత్రాల్లో నటిస్తుంది. గతంలో ఒక్కో సినిమాకు రూ.5 కోట్ల వరకు తీసుకునే రష్మిక.. ఇప్పుడు ఒక్కో చిత్రానికి రూ.10 కోట్లు తీసుకుంటుంది.