నా బ్రాండే యంగ్ ఇండియా.. ఇది రికార్డు సృష్టిస్తుందిః సీఎం రేవంత్ రెడ్డి
యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకూ రాష్ట్రాన్ని పాలించిన ప్రతి సీఎంకు ఓ బ్రాండ్ ఉంది. తాను కూడా ఓ బ్రాండ్ క్రియేట్ చేశానకుంటున్నానని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తరగతి గదులు బలంగా ఉంటేనే దేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకూ రాష్ట్రాన్ని పాలించిన ప్రతి సీఎంకు ఓ బ్రాండ్ ఉంది. తాను కూడా ఓ బ్రాండ్ క్రియేట్ చేశానకుంటున్నానని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తరగతి గదులు బలంగా ఉంటేనే దేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏటా లక్షమందికి పైగా విద్యార్థులు తెలంగాణలో బీటెక్ పూర్తి చేస్తున్నారు. కానీ వారిలో నాణ్యత ఎంతంటే.. ఎవరి దగ్గరా సమాధానం లేదన్నారు. విద్యార్థుల్లో స్కిల్స్ పెంచేందుకే యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మిస్తున్నామన్నారు.
యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రతీ పోలీస్ సిబ్బందికి ఇది అత్యంత ముఖ్యమైనదనిచ తమ ఎన్నికల మేనిఫెస్టోలోనే ఈ స్కూల్ ఏర్పాటును చేర్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఆనాడు పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ సారథ్యంలో దేశంలో యూనివర్సిటీలకు పునాదులు పడినట్టు సీఎం చెప్పారు. నెహ్రూ దార్శనికతతోనే భారత్ గ్లోబల్ స్థాయిలో ఎదిగిందని తెలిపారు. దేశ చరిత్రలో ఎంతో మంది ముఖ్యమంత్రులు, ప్రధానులు వచ్చినా.. వారిలో కొంతమంది తీసుకున్న నిర్ణయాలే చరిత్రను మలుపు తిప్పాయన్నారు.
ప్రతి ముఖ్యమంత్రికి ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఉందని సీఎం చెప్పారు. ఎన్టీఆర్ రూ.2 బియ్యం ద్వారా పేదల మనసుల్లో నిలిచిపోయారని, హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధితో చంద్రబాబు నాయుడు తనదైన గుర్తింపు తెచ్చుకున్నారని, వైఎస్ రైతు బాంధవుడిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. అలాగే తాను “యంగ్ ఇండియా” అనే బ్రాండ్‌ను రూపొందించినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.
మహాత్మా గాంధీ స్ఫూర్తితో యంగ్ ఇండియా బ్రాండ్‌ను తెలంగాణలో స్థాపించామని సీఎం రేవంత్ చెప్పారు. దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే తయారవుతుందని అభిప్రాయపడ్డారు. అందుకే ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్‌ను ప్రభుత్వ బ్రాండ్‌లుగా తీసుకున్నామని చెప్పారు. నిరుద్యోగ యువతకు శిక్షణ కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను యూనివర్సిటీ చైర్‌పర్సన్‌గా నియమించామని తెలిపారు. ఈ యూనివర్సిటీకి చేరిన ప్రతీ విద్యార్థికి ఉద్యోగ భద్రత కల్పించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్టు చెప్పారు.
వచ్చే ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని, యంగ్ ఇండియా అకాడమీని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టుతున్నట్టు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల విస్తీర్ణంలో రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రాథమిక స్థాయిలో మార్పులు తీసుకొస్తున్నట్టు చెప్పారు. ఒకటో తరగతి నుంచే స్టార్టయ్యే స్కూల్స్‌కి బదులు ప్రీ-స్కూల్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
పోలీస్ స్కూల్‌ను సైనిక్ స్కూల్ స్థాయిలో తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ సూచించారు. ఇందుకోసం అవసరమైన నిధులు ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. రూ.100 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటుపై ప్రతిపాదన చేశారని చెప్పారు. ప్రైవేట్ కంపెనీలు సామాజిక బాధ్యతగా స్కూల్‌కు ఆర్థిక సహాయం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ పిలుపునిచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
