AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dubai Seenu Movie: దుబాయ్ శీను విలన్ భార్య ఫేమస్ డ్యాన్సర్.. అందంలో హీరోయిన్స్ సైతం దిగదుడుపే..

సినిమాల్లో హీరోలు మాత్రమే కాదు.. విలన్ పాత్రలు పోషించి పాపులర్ అయిన నటులు చాలా మంది ఉన్నారు. అయితే ఒకటి రెండు చిత్రాలతోనే సక్సెస్ అయినవారు ఉండగా.. ఓ నటుడు మాత్రం ఏకంగా 11కు పైగా సినిమాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. కానీ బుల్లితెరపై మాత్రం చాలా సక్సెస్ అయ్యాడు. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ?

Dubai Seenu Movie: దుబాయ్ శీను విలన్ భార్య ఫేమస్ డ్యాన్సర్.. అందంలో హీరోయిన్స్ సైతం దిగదుడుపే..
Dubai Seenu
Rajitha Chanti
|

Updated on: Apr 20, 2025 | 9:43 PM

Share

సినీరంగంలో పెద్ద స్టార్ కావాలని కలలు కనని నటులు ఉండరు. అందులోనూ విలన్ పాత్రలతో ఫేమస్ అయినవారు చాలా తక్కువ. అందులో సుశాంత్ సింగ్ ఒకరు. దాదాపు 11కు పైగా సినిమాల్లో నటించి అద్భుతమైన నటనతో మెప్పించారు. కానీ అతడికి అంతగా గుర్తింపు మాత్రం రాలేదు. కానీ బుల్లితెరపై నటుడిగా మరింత ఫేమస్ అయ్యారు. సినిమాల్లో సక్సెస్ అందుకోలేకపోయిన అతడు టీవీల్లో మాత్రం రాణిస్తున్నారు. పాపులర్ క్రైమ్ షో సావ్ ధాన్ ఇండియా కు హోస్ట్ గా మారి దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. 1998లో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సత్య సినిమాతో సినీ ప్రయాణం స్టార్ట్ చేశాడు.

ఆ తర్వాత 2002లో వచ్చిన జంగిల్ సినిమాతో అతడికి సరైన బ్రేక్ వచ్చింది. ఇందులో దుర్గ నారాయణ్ చౌదరి అనే పవర్ ఫుల్ బందిపోటు పాత్రలో నటించాడు. ఆ తర్వాత జోష్, చార్ ది కీ చాందినీ, లక్ష్య, లిప్ స్టిక్ అండర్ మై బుర్ఖా వంటి చిత్రాల్లో నటించాడు. అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ వంటి చిత్రాల్లో నటించి నటుడిగా ప్రశంసలు అందుకున్నాడు. ఇక తెలుగులో రవితేజ నటించిన దుబాయ్ శీను సినిమాలో విలన్ పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత బుల్లితెరపై సావ్ ధాన్ ఇండియా షోకు హోస్ట్ గా కనిపించి మరింత పాపులర్ అయ్యాడు. ఈ షోతో సుశాంత్ సింగ్ పాపులారిటీ పెరిగిపోయింది. అలాగే టీవీల్లో పలు సీరియల్స్, రియాల్టీ షోలలో కనిపించాడు.

నివేదికల ప్రకారం సుశాంత్ సింగ్ ఆస్తులు రూ.10 కోట్లకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 25 ఏళ్లకు పైగా సినీరంగంలో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే.. సుశాంత్ సింగ్ భార్య మోలినా సింగ్. ఆమె ఒడిస్సీ నృత్యకారిణి. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. మోలినా సింగ్ ప్రసిద్ధ నాటక గురు ఇబ్రహీం అల్ఖాజీ శిష్యురాలు. ఆమె ఒడిస్సీ నృత్యం సోలో ప్రదర్శనలు కూడా ఇస్తుంది. జంగిల్ సినిమా షూటింగ్ సమయంలో సుశాంత్ మోలినాను వివాహం చేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి :  

Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..

Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..

OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..

ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!