చలికాలంలో ఉదయం నడకలు గుండె ఆరోగ్యానికి ముప్పు కలిగించవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చల్లని వాతావరణం రక్తనాళాలను సంకోచింపజేసి అధిక రక్తపోటు, రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతుంది. వృద్ధులు సూర్యోదయం తర్వాత నడవాలి, స్వెటర్లు ధరించాలి, వార్మప్లు చేయాలి. కాలుష్యం ఉన్నప్పుడు ఇంట్లోనే వ్యాయామం చేయడం మంచిది.