మీనాక్షి బిజీ అయ్యింది.. కానీ ఐశ్వర్య అవ్వలేకపోతుంది..

2  January 2026

Pic credit - Instagram

Rajeev 

ఐశ్వర్య రాజేష్.. ఈ అందాల భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత ఏడాది  సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్ అందుకుంది.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా గత ఏడాది జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమాలో వెంకటేష్ హీరోగా నటించగా.. ఆయన భార్యగా ఐశ్వర్య రాజేష్ నటించి మెప్పించింది. 

అంతకు ముందు తెలుగులో కొన్ని క్రేజీ సినిమాలు చేసింది. కానీ ఆ సినిమాలు ఐశ్వర్యకు అంతగా పేరు తెచ్చిపెట్టలేదు. 

సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఐశ్వర్య రాజేష్ పేరు మారుమ్రోగింది. కానీ అవకాశాలు మాత్రం అంతగా పలకరించడం లేదు. 

సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నటించిన మీనాక్షి చౌదరి వరుసగా సినిమాలను లైనప్ చేస్తుంటే.. ఈ అమ్మడు మాత్రం వెనకబడింది. 

వరుసగా సినిమాలు చేయకపోయినా.. సోషల్ మీడియా ద్వారా అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ.