Vijay Sethupathi: ఆ హీరోయిన్‌తో లిప్ లాక్ సీన్ చేయనని తెగేసి చెప్పిన విజయ్ సేతుపతి.. కృతి శెట్టి కాదండోయ్.. ఇంతకీ ఎవరంటే..
విజయ్ సేతుపతి పాన్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ది టాప్ హీరో. విభిన్నమైన కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. కానీ మీకు తెలుసా.. సినిమా కోసం విజయ్ సేతుపతి రొమాంటిక్ సన్నివేశాల్లో నటించేందుకు అస్సలు ఇష్టపడరు. అలాగే ఓ హీరోయిన్ తో లిప్ లాక్ సీన్ చేసేందుకు అస్సలు ఒప్పుకోలేదట.

ప్రస్తుతం సినీరంగంలో నటీనటులు తమ సినిమాలను విజయవంతం చేయడానికి ఎలాంటి పాత్రలోనైనా నటించేందుకు సిద్ధంగా ఉన్నారు. పాత్రకు అవసరమైతే రొమాంటిక్ సన్నివేశాల్లో నటించేందుకు రెడీ అంటున్నారు. కానీ అందరూ హీరోహీరోయిన్స్ ఒకేలా ఉండరు. తమ గౌరవాన్ని కాపాడుకునేందుకు ఎలాంటి పాత్రలు, సీన్స్ లో నటించేందుకు నిరాకరించే హీరోలు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. తమ సినీప్రయాణంలో రొమాంటిక్ సన్నివేశాలకు దూరంగా ఉండే నటీనటులు చాలా తక్కువ. అందులో విజయ్ సేతుపతి ఒకరు. అవును.. అతడితో లిప్ లాక్ సీన్ చేసేందుకు హీరోయిన్ అంగీకరించినప్పటికీ హీరో మాత్రం సిద్ధంగా లేరు. చివరకు ఆ సన్నివేశం లేకుండానే షూటింగ్ పూర్తైంది. కట్ చేస్తే ఆ మూవీ సూపర్ హిట్. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా.. అదే 96. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది.
అయితే ఈ సినిమాలో హీరోహీరోయిన్ మధ్య లిప్ లాక్ సీన్ ఉంటుందని దర్శకుడు ముందే వివరించాడట. ఈ సీన్ కు త్రిష ఒప్పుకున్నప్పటికీ విజయ్ సేతుపతి మాత్రం అస్సలు అంగీకరించలేదట. ఈ సినిమా క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఇద్దరూ ఒకరికొకరు వీడ్కోలు పలికే సన్నివేశం. ఇప్పటికీ ఈ సీన్ ప్రేక్షకుల మనస్సుల్లో చెరగనిదిగా ఉంది. వీరిద్దరు విమానాశ్రయంలో వీడ్కోలు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ సమంయలో త్రిష, విజయ్ సేతుపతి మధ్య లిప్ లాక్ సీన్ ఉంమడాలి. కానీ ఈ సీన్ చేసేందుకు విజయ్ సేతుపతి ఒప్పుకోలేదట. దీంతో ముద్దు సన్నివేశం లేకుండానే సినిమా షూటింగ్ పూర్తైంది. బదులుగా విజయ్ సేతుపతి ముఖంపై చేతులు పెట్టి ఎమోషనల్ అవుతూ వీడ్కోలు చెబుతుంది త్రిష.
96 చిత్రంలో త్రిష జాను పాత్రలో కనిపించింది. అయితే ఈ సినిమాలో విజయ్ సేతుపతి లిప్ లాక్ సీన్ చేయకపోవడానికి రీజన్ ఉంది. విజయ్ సేతుపతి తన సినిమాల్లో ముద్దు సన్నివేశాలు చేయడు. అలాంటి సన్నివేశాలు చేయనని దర్శకుడికి ముందే చెబుతారు. అలాగే అజిత్, సూర్య, శివకార్తికేయన్ సైతం లిప్ లాక్ సన్నివేశాల్లో నటించరు. ప్రస్తుతం త్రిష, విజయ్ ఇద్దరూ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..
Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..
OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..




