Maoists Targets: పినపాక నియోజకవర్గంలో మావోయిస్టుల కలకలం.. వ్యాపారికి బెదిరింపులు..

Maoists Targets: పినపాక నియోజక వర్గంలో మళ్లీ మావోయిస్టుల అలజడి మొదలైంది. ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు నుంచి భద్రాద్రి ఏజెన్సీలో చొరబడి గోదావరి పరీవాహక ప్రాంతాల ద్వారా ఇతర జిల్లాల్లోకి వచ్చి.. రిక్రూట్

Maoists Targets: పినపాక నియోజకవర్గంలో మావోయిస్టుల కలకలం.. వ్యాపారికి బెదిరింపులు..
Maoists
Follow us
uppula Raju

|

Updated on: Mar 09, 2021 | 3:01 PM

Maoists Targets: పినపాక నియోజక వర్గంలో మళ్లీ మావోయిస్టుల అలజడి మొదలైంది. ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు నుంచి భద్రాద్రి ఏజెన్సీలో చొరబడి గోదావరి పరీవాహక ప్రాంతాల ద్వారా ఇతర జిల్లాల్లోకి వచ్చి.. రిక్రూట్‌మెంట్లు చేసుకునేందుకు యత్నిస్తున్నారని నిఘా వర్గాల సమాచారం. తాజాగా ఓ వ్యాపారికి మావోయిస్టుల నుంచి బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది.

గతంలో గోదావరి తీరంలో ఎన్‌కౌంటర్‌లో చాలా మంది మావోలు మృతిచెందారు. అయితే కొన్ని రోజులుగా ప్రశాంతంగా ఉన్న పినపాక నియోజకవర్గం తాజా సమాచారంతో మళ్లీ మావోలు వచ్చారనే ప్రచారం జరుగుతుంది. తాజాగా మావోయిస్టు పార్టీ భద్రాచలం ఏరియా కమిటీ పేరుతో ఓ వ్యాపారికి బెదిరింపులు వచ్చాయి. సుక్మా వచ్చి కలవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఎన్నో ఏళ్ల తరువాత మావోయిస్టుల పేరుతో బెదిరింపులు రావడంతో ఆ ఏరియా వ్యాపారులు హడలిపోతున్నారు. అయితే పోలీసులు దీనిపై నజర్ పెట్టారు. మావోయిస్టుల పేరుతో బెదిరింపులకు పాల్పడిన వారు.. నిజమైన మావోలా లేక నకిలీలా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే మావోయిస్టులు మళ్లీ వచ్చారని ప్రచారం జరగడంతో రాజకీయ నాయకులకు, వ్యాపారులకు కంటి మీద కునుకు ఉండటం లేదు.

మరిన్ని చదవండి :

నిజామాబాద్‌ జిల్లా ధర్యాపూర్‌లో దేవతా విగ్రహాల ధ్వంసం.. ఆగ్రహిస్తున్న గ్రామస్థులు.. నిందితులను పట్టుకోవాలని డిమాండ్..

Police Arrested BJP Leaders : కామారెడ్డి జిల్లా భిక్కనూరులో ఉద్రిక్తత.. బీజేపీ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు..

ఇండియాలో సెహ్వాగ్ తర్వాత మళ్లీ ఇతడే.. తన క్రికెట్ జీవితంలో ఇలాంటి ఆటగాడిని చూడలేదంటున్న పాకిస్తాన్ మాజీ సారథి..

Karnataka Crime : కర్ణాటకలో దారుణం.. అనుమానంతో భార్యను ముక్కలు ముక్కలుగా నరికిచంపిన భర్త.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..