తెలంగాణలో హీటెక్కున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం.. ఆ విషయంలో రాజీనామాకు సిద్ధమంటూ బీజేపీకి మంత్రుల సవాళ్లు

తెలంగాణలో బీజేపీపై అదికార పార్టీ దూకుడు పెంచింది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎదరుదాడి చేస్తున్నారు మంత్రులు. పట్టభద్రుల ఓటర్లే లక్ష్యంగా సాగుతున్న..

తెలంగాణలో హీటెక్కున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం.. ఆ విషయంలో రాజీనామాకు సిద్ధమంటూ బీజేపీకి మంత్రుల సవాళ్లు
Follow us
K Sammaiah

|

Updated on: Mar 09, 2021 | 2:00 PM

తెలంగాణలో బీజేపీపై అదికార పార్టీ దూకుడు పెంచింది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎదరుదాడి చేస్తున్నారు మంత్రులు. పట్టభద్రుల ఓటర్లే లక్ష్యంగా సాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో నిరుద్యోగ అంశం ప్రధాన ఆస్త్రంగా మారింది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఏటా 2 కోట్ల ఉద్యాగాల హామీ ఏమైంది అంటూ తెలంగాణ మంత్రులు ప్రశ్నిస్తున్నారు. దీంతో బీజేపీ నేతలు ఆత్మరక్షణలో పడ్డారు.

ఇక మంత్రులు మరో అడుగు ముందుకేసి రాజీనామాలకు సిద్ధమంటూ సవాళ్లు విసురుతుండటం ఎన్నికల ప్రచారాన్ని మరింత హీటెక్కిస్తుంది. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణా రాష్ట్రం కన్నా బిజెపి పాలిత రాష్ట్రాలు ఏ మాత్రం ఎక్కువ ఉన్నట్లు నిరూపిచినా..మంత్రి పదవులకు రాజీనామ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు మంత్రులు శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి. లేని పక్షంలో ఎంపి పదవికి బండి సంజయ్ రాజీనామ చేస్తారా …అని సవాల్ విసిరారు.

మహబూబ్ నగర్ పట్టణంలోని టిఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన ఎంఎల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ లక్ష ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చామో తమ వద్ద లెక్కలున్నాయని, ఉద్యోగాలు పొందిన వారు కళ్ల ముందున్నారని అన్నారు. దేశానికి ప్రధానిగా పని చేసిన వ్యక్తు కుటుంబాన్ని గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

సంవత్సరానికి ఎనిమిది వేల కోట్ల రూపాయల పిన్షన్లను తెలంగాణా ప్రభుత్వం ఇస్తోందని, బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఇంతకన్న ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి మంత్రి పదవులకు రాజీనామ చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. అలాగే మిగతా సంక్షేమ పథకాల్లో తెలంగాణా కన్నా బిజెపి పాలిత రాష్ట్రాలు ఏమాత్రం ఎక్కువ ఉన్నట్లు నిరూపించినా, 16 వందల రూపాయల కన్నా ఒక్క పైసా ఎక్కువ ఇస్తున్నట్లు నిరూపించినా… తాము రాజీనామ చేయడానికి సిద్ధంగా ఉన్నామని లేని పక్షంలో ఎంపి పదవికీ రాజీనామ చేసేందుకు బండి సంజయ్ సిద్ధంగా ఉన్నారా అంటూ సవాల్ విసిరారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.

పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా తెలంగాణా కన్నా బిజెపి పాలిత రాష్ట్రాలు ఒక్క ఉద్యోగం ఎక్కువ ఇచ్చినట్లు నిరూపించినా తామ పదవులకు రాజీనామ చేస్తామని అన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 30 వేల ఉద్యోగాలు తెలంగాణా రాష్ట్రం ఇస్తే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ 19 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని, ప్రధాని మోడి సొంత రాష్ట్రమైన గుజరాత్ లో నాలుగు వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని విమర్సించారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.

మొత్తానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఒంటికాలిపై లేచే బండి సంజయ్‌కి మంత్రులు సవాళ్లు విసరడం హాట్‌ టాపిక్‌ మారాయి. టీఆర్‌ఎస్‌కు ధీటుగా ప్రచారం నిర్వహిస్తున్న బీజేపీని ఇరకాటంలో పెట్టాయనే టాక్‌ నడుస్తుంది. మంత్రుల సవాళ్లపై బీజేపీ నేతల నుంచి ఎలాంటి రెస్పాన్స్‌ వస్తుందో చూడాలి మరి.

Read More:

మహబూబాబాద్‌లో బీజేపీ భారీ ర్యాలీ.. ఉద్యమ పార్టీలో తెలంగాణ ద్రోహులు చేరారన్న కపిలవాయి

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!