పాలక్కాడ్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ పాగా వేయగలుగుతుందా? యూడీఎఫ్‌ హ్యాట్రిక్‌ కొట్టగలుగుతుందా?

కల్పాతిలోని వృద్ధులకు ఇప్పుడో చింత పట్టుకుంది.. కోవిడ్‌ వ్యాక్సిన్‌ తమకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా అన్నదే ఆ దిగులుకు కారణం..

పాలక్కాడ్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ పాగా వేయగలుగుతుందా? యూడీఎఫ్‌ హ్యాట్రిక్‌ కొట్టగలుగుతుందా?
Follow us
Balu

| Edited By: Anil kumar poka

Updated on: Mar 09, 2021 | 2:18 PM

కల్పాతిలోని వృద్ధులకు ఇప్పుడో చింత పట్టుకుంది.. కోవిడ్‌ వ్యాక్సిన్‌ తమకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా అన్నదే ఆ దిగులుకు కారణం.. ఇంకెన్ని రోజులు ఎదురుచూడమంటారని సూటిగానే ప్రశ్నిస్తున్నారు 65 ఏళ్ల రామనాథన్‌. అసలు ఆరోగ్యశాఖ ఏం చేస్తున్నట్టు? ఎందుకు సమాచారం ఇవ్వడం లేదు? అని నిలదీస్తున్నారు 68 ఏళ్ల రఘురామ్‌.. కేరళలోని పాలక్కాడ్‌ జిల్లాలో ఉన్న కల్పాతి అగ్రహారాలకు పెట్టింది పేరు. అంటే బ్రాహ్మణ సామాజికవర్గం ఎక్కువన్నమాట! అందులోనూ 60 ఏళ్లు దాటిన వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుందిక్కడ! కోవిడ్‌ వాక్సినేషన్‌ విషయంలో వృద్ధులకు ప్రాధాన్యత ఉందన్న సంగతి వారికి తెలుసు కానీ.. ఎందుకు ఆలస్యం అవుతున్నదో మాత్రం తెలియడం లేదు.. అందుకు కారణం ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ఫార్మాలిటీస్‌ వారికి తెలియకపోవడం.. కొత్త టెక్నాలజీని తాము అందుకోలేకపోతున్నామని, ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ పద్దతులు తమకు తెలియడం లేదని అంగీకరిస్తున్నారు. అసలు ప్రభుత్వం ఈ పద్దతిని ఎందుకు పెట్టిందో అర్థం కావడం లేదని పౌరోహిత్యం చేసుకునే 70 ఏళ్ల బాలు వాద్యార్‌ అంటున్నారు. వాక్సినేషన్‌ ఆందోళనలు వారిలో ఉన్నా ఏప్రిల్‌ ఆరున జరిగే ఎన్నికలకు మాత్రం సంసిద్ధులవుతున్నారు. టీకాలు వేయించుకున్నా.. వేయించుకోకపోయినా ఫర్వాలేదు కానీ పోలింగ్‌లో మాత్రం తప్పకుండా పాల్గొంటామని, ఈ దేశ పౌరులుగా అది తమ బాధ్యత అని గట్టిగా చెబుతున్నారు. అయితే రాజకీయాల గురించి బహిరంగంగా మాట్లాడటడం వీరికి అంతగా రుచించదు. నలుగురి ముందు రాజకీయాల గురించి మాట్లాడటం అంత మంచిది కాదని, ఈ సారి తాను మార్పు కోసం ఓటు వేయదల్చుకున్నానని తన మనసులో మాట చెప్పారు రామనాథన్‌ అనే ఆలయ పూజారి. చాలా మంది ఇదే అభిప్రాయంతో ఉన్నారని చెప్పుకొచ్చారు. రామనాథన్‌ నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి? మార్పు అంటే ప్రస్తుతం ఉన్న ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వానికి కాకుండా యూడీఎఫ్‌కు ఓటు వేస్తారనా? లేకపోతే ప్రస్తుతం పాలక్కాడ్‌లో ఉన్న యూడీఎఫ్‌ ఎమ్మెల్యేకు కాకుండా ఎల్‌డీఎఫ్‌ అభ్యర్థికి వేస్తారా? అదీ కాకపోతే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు మద్దతు పలుకుతారా?

రామనాథన్‌ మనసులో ఏముందో తెలియడం లేదు కానీ.. కల్పాతి ఉన్న పాలక్కాడ్‌ నియోజకవర్గంలో మాత్రం ఈసారి కూడా యూడీఎఫ్‌ అభ్యర్థే గెలిచే అవకాశాలున్నాయి.. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యునైటెడ్‌ డెమొక్రాటిక్‌ ఫ్రంట్‌, బీజేపీ అధ్వర్యంలోని నేషనల్‌ డెమెక్రాటిక్‌ అలయెన్స్‌, సీపీఎం సారథ్యంలోని లెఫ్ట్‌ డెమొక్రాటికల్‌ ఫ్రంట్‌లు విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నా మాట నిజమే కానీ.. ప్రస్తుత ఎమ్మెల్యే షఫీ పరంబిల్‌ ప్రత్యర్థుల కంటే కొంచెం ముందంజలో ఉన్నారు. యూత్‌ కాంగ్రెస్‌లో కీలక పాత్ర పోషిస్తున్న షఫీ హ్యాట్రిక్‌ విజయం కోసం ఉవ్విళూరుతున్నారు. 2011లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో షఫీ 7,403 ఓట్ల తేడాతో సీపీఎంకు చెందిన కేకే దివాకరన్‌ను ఓడించారు. 2016లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి శోభా సురేంద్రన్‌పై 17,483 ఓట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకున్నారు. విచిత్రమేమిటంటే సీసీఎంకు చెందిన సీనియన్‌ నాయకుడు ఎన్‌.ఎన్‌. కృష్ణదాస్‌ మూడో స్థానంలో నిలవడం. ఈసారి కూడా తనదే విజయమని అంటున్నారు షఫీ.. తాను రాజకీయాల కంటే అభివృద్ధిపైనే దృష్టి సారిస్తానని, ఆ విషయం పాలక్కాడ్‌ ప్రజలకు బాగా తెలుసుని చెబుతున్నారు. తన హయాంలో అభివృద్ధి ఫలాలు అందరికీ అందాయని గర్వంగా చెప్పగలనని షఫీ పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్‌ అధిష్టానం ఇప్పటి వరకు షఫీ పేరును అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ తనకు టికెట్ గ్యారంటీ అన్న నమ్మకంతో ఉన్నారాయన. కాకపోతే సీనియర్‌ నేత ఎ.వి.గోపీనాథ్‌ కూడా టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. చిట్టూర్‌ మాజీ ఎమ్మెల్యే కె.అచ్యుతన్‌, సీనియర్‌ నాయకుడు వీ.సీ. కబీర్‌ అండదండలతో గోపీనాథ్‌ స్వరం పెంచారు. గోపీనాథ్‌ను కాదని షఫీకే అధిష్టానం టికెట్‌ ఇస్తే మాత్రం నియోజకవర్గంలో కొన్ని ఓట్లను వదులుకోవలసి వస్తుంది.. ఎందుకంటే అక్కడ గోపీనాథ్‌కు అంతో ఇంతో బలముంది.

పాలక్కాడ్‌లో బీజేపీ కూడా క్రమంగా బలపడుతూ వస్తోంది. మొన్న డిసెంబర్‌లో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో పాలక్కాడ్‌ను బీజేపీ దక్కించుకుంది కూడా! ఇదే షఫీకి కాసింత ఆందోళన కలిగిస్తున్న అంశం. పాలక్కాడ్‌లో కొత్తగాలివీస్తున్నదని, ఈసారి బీజేపీ తప్పకుండా విజయం సాధిస్తుందని అంటున్నాడు బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణదాస్‌. పాలక్కాడ్‌ నుంచి ఎవరు పోటీ చేస్తారన్నది త్వరలోనే నిర్ణయిస్తామని చెప్పుకొచ్చారు. పాలక్కాడ్‌ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసే అభ్యర్థిని చూసి మీరు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారని కూడా అన్నారు. ఆయన ఆ మాటన్నారంటే బహుశా మెట్రోమాన్‌ ఈ..శ్రీధరన్‌ను బరిలో దింపుతారేమో! మొన్నీమధ్యనే బీజేపీ తీర్థం పుచ్చుకున్న శ్రీధరన్‌కు ముఖ్యమంత్రి కావాలన్న కోరిక కూడా బలంగానే ఉంది.. కేరళలో బీజేపీ అధికారంలోకి వస్తే తానే ముఖ్యమంత్రినని శ్రీధరన్‌ ఒకట్రెండుసార్లు అన్నారు కూడా! శ్రీధరన్‌ను మలప్పురం జిల్లాలోని పొన్నాని నియోజకవర్గం నుంచి బరిలో దింపాలన్నది అధిష్టానం ఆలోచన! ఎందుకంటే శ్రీధరన్‌ పుట్టింది పొన్నానిలోనే కాబట్టి. అయితే శ్రీధరన్‌కు పాలక్కాడ్‌ నియోజకవర్గమే శ్రేయస్కరమని, ఇక్కడ్నుంచే గెలిచే అవకాశాలున్నాయని కొందరు కమలనాథులు అంటున్నారు. మధ్యతరగతి ప్రజలు కచ్చితంగా శ్రీధరన్‌కే ఓటు వేస్తారన్నది వారి నమ్మిక! శ్రీధరన్‌ బీజేపీలో తీర్థం పుచ్చుకున్నారో లేదో వెంటనే హిందుత్వ స్టాండ్‌ తీసుకున్నారు. లవ్‌ జిహాద్‌ గురించి, బీఫ్‌ మాంసభక్షణ గురించి మాట్లాడటం మొదలు పెట్టారు. హిందు అమ్మాయిలను ముస్లిం కుర్రవాళ్లు పెళ్లి చేసుకొని వారిని బలవంతంగా ఇస్లాంలోకి మార్చేస్తున్నారని శ్రీధరన్‌ స్టేట్‌మెంట్లు ఇచ్చారు..

గణంకాలు మాత్రం యూడీఎఫ్‌కే సపోర్ట్‌ చేస్తున్నాయి. పాలక్కాడ్‌ నియోజకవర్గంలో కన్నాడి, పిరయిరి, మధుర్‌ అనే గ్రామ పంచాయితీలతో పాటుగా పాలక్కాడ్‌ మునిసిపాలిటీ కూడా ఉంది.. లాస్టియర్‌ డిసెంబర్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పాలక్కాడ్‌ మునిసిపాలిటీని ఎన్డేయే గెల్చుకుంది. ఎన్డీయే 28 స్థానాలు గెల్చుకుంటే, యూడీఎఫ్‌ 14 సీట్లను మాత్రమే గెల్చుకోగలిగింది. ఎల్‌డీఎఫ్‌ ఏడు స్థానాలతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు, వెల్‌ఫేర్‌ పార్టీ ఆఫ్‌ ఇండియాకు చెందిన ఓ అభ్యర్థి కూడా విజయం సాధించారు. మధుర్‌, పిరయిరి పంచాయితీలలో యూడీఎఫ్‌ పాలన సాగుతోంది. కన్నడిలో మాత్రం ఎల్‌డీఎఫ్‌ రూల్‌ చేస్తోంది. ఈ లెక్కలన్నీ తీస్తే కాంగ్రెస్‌ కూటమినే ఆధిక్యంలో ఉంది. యూడీఎఫ్‌ 35 స్థానాలతో ముందుంటే, ఎన్డీయే 30 స్థానాలతో రెండో స్థానంలో ఉంది. ఎల్‌డీఎఫ్‌ 27 స్థానాలతో మూడో స్థానంలో నిలిచింది. యూడీఎఫ్‌కు మొత్తం 48,663 ఓట్లు లభించగా, ఎల్‌డీఎఫ్‌కు 44, 878 ఓట్లు వచ్చాయి. 38,444 ఓట్లతో ఎన్డీయే మూడో స్థానంలో నిలిచింది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను చూసి వచ్చే అసెంబ్లీ ఎన్నికలను బేరీజు వేయడం తగదని షఫీ అంటున్నారు. పాలక్కాడ్‌ నియోజకవర్గ ప్రజలు ఎప్పుడూ యూడీఎఫ్‌ పక్షానే ఉంటారన్నారు. పాలక్కాడ్‌లో పూర్వవైభవాన్ని తిరిగి సంపాదిస్తామనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు సీపీఎం జిల్లా కార్యదర్శి సీ.కే. రాజేంద్రన్‌. నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయని, ఇందుకు మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే నిదర్శనమని అన్నారాయన! ముస్లింలలో యూడీఎఫ్‌ పట్ల భ్రమలు తొలగిపోయానని, వారంతా ఎల్‌డీఎఫ్‌ వెంటే ఉన్నారని అన్నారు. గత పదేళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్న షఫీ నియోజకవర్గానికి ఏమీ చేయలేదని ఎన్డీయే, ఎల్‌డీఎఫ్‌లు అంటున్నాయి. బస్‌ టర్మినల్‌ నిర్మాణంలో షఫీ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని విమర్శిస్తున్నారు. మోయాన్స్‌ మోడల్ గర్ల్స్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌ను డిజిటైజేషన్‌లో కూడా షఫీ ఫెయిలయ్యారని విపక్షాలు తిట్టిపోస్తున్నాయి. మొత్తంగా పాలక్కాడ్‌ నియోజకవర్గం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.. అక్కడ బీజేపీ పాగా వేస్తుందా? ఎల్‌డీఎఫ్‌ జెండా పాతుతుందా అన్నది చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి:

టమాటా పులిహోరా.. ఇలా చేస్తే క్షణాల్లోనే మరింత రుచికరంగా.. మీరు ట్రై చేసేయ్యండిలా..

కార్మిక సంఘాలను తప్పుదోవ పట్టిస్తున్నారు.. విశాఖ ఉక్కుపై ఆయన ఎందుకు మాట్లాడటం లేదన్న సజ్జల

బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.