Karnataka Crime : కర్ణాటకలో దారుణం.. అనుమానంతో భార్యను ముక్కలు ముక్కలుగా నరికిచంపిన భర్త.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..

Man Assassination Wife Karnataka : రోజు రోజుకు మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు ఎక్కువై పోతున్నాయి. చిన్న చిన్న కారణాలకే మహిళల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు కొంతమంది దుర్మార్గులు.

Karnataka  Crime : కర్ణాటకలో దారుణం.. అనుమానంతో భార్యను ముక్కలు ముక్కలుగా నరికిచంపిన భర్త.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..
Follow us
uppula Raju

|

Updated on: Mar 09, 2021 | 12:01 PM

Man Assassination Wife Karnataka : రోజు రోజుకు మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు ఎక్కువై పోతున్నాయి. చిన్న చిన్న కారణాలకే మహిళల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు కొంతమంది దుర్మార్గులు. అనుమానం పేరుతో కట్టుకున్న భార్యను చంపుతున్న సంఘటనలు దేశంలో రోజుకు ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. దీంతో అభం శుభం తెలియని చిన్నారులను అనాథలుగా చేసి కుటుంబాలను విచ్ఛినం చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి కర్ణాటక రాష్ట్రంలో జరిగింది.

మండ్య జిల్లా పాండవపుర తాలూకా దేశవళ్లికి చెందిన ఆశా (28), రంగప్ప భార్యభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు, భార్యకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో నాలుగు నెలల క్రితం రంగప్ప, బావ చంద్రతో కలిసి ఆశాను నరికి చంపాడు. కొడవలితో శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి హేమావతి నదిలో పడేశారు. అయితే వీరిపై అనుమానించిన ఆశా తండ్రి గౌరి శంకర్‌ పాండవపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే క్రమంలో కృష్ణరాజపేట పోలీసులు గుర్తు తెలియని మృతదేహంపై సమాచారం ఇచ్చారు.

గౌరి శంకర్‌ మృతదేహాన్ని చూసి తన కుమార్తెగా గుర్తించాడు. దీంతో పోలీసులు మృతురాలి భర్త రంగప్పను అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో నిజం ఒప్పుకున్నాడు. వెంటనే పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కి తరలించారు. కాగా తల్లి చనిపోవడంతో ముగ్గురు పిల్లలు అనాథలుగా మారిపోయారు. అంతేకాకుండా ఇటు తండ్రి జైలుపాలయ్యాడు. ఇప్పడు పిల్లల ఆలనాపాలనా చూసేవారు కరువయ్యారు. క్షణికావేశంలో చేసిన హత్య ఇందరి జీవితాలను తారుమారు చేసింది.

Dharani website : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. మీ పట్టా పాస్ బుక్‌లో తప్పులున్నాయా..? అయితే ఇలా సవరించుకోండి.. Fahadh Faasil : ఫాహద్ ఫాసిల్ ఆరోగ్యంపై స్పందించిన నజ్రియా.. ప్రస్తుతం అంతా బాగానే ఉందని ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో షేర్..