కోల్ కతా అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సహాయనిధి నుంచి 2 లక్షల ఎక్స్ గ్రేషియా

కోల్ కతా లోని రైల్వే బిల్డింగ్ కార్యాలయంలో రేగిన మంటల్లో మరణించినవారి సంఖ్య తొమ్మిదికి చేరింది. కొంతమంది గాయపడ్డారు. ఈ ఘటన పట్ల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

కోల్ కతా అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సహాయనిధి నుంచి 2 లక్షల ఎక్స్ గ్రేషియా
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Mar 09, 2021 | 10:55 AM

కోల్ కతా లోని రైల్వే బిల్డింగ్ కార్యాలయంలో రేగిన మంటల్లో మరణించినవారి సంఖ్య తొమ్మిదికి చేరింది. కొంతమంది గాయపడ్డారు. ఈ ఘటన పట్ల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి సహాయ నిధి కింద పీఎంఓ కార్యాలయం  రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.  తీవ్రంగా గాయపడినవారికి 50 వేల సాయాన్ని అందజేయాలని ఈ కార్యాలయం సూచించింది. 13 వ అంతస్థులో తలెత్తిన మంటలు మిగతా అన్ని ఫ్లోర్లకు వ్యాపించాయని, ముఖ్యంగా 12 వ ఫ్లోర్ పూర్తిగా దగ్ధమైందని రైల్వే అధికారులు  తెలిపారు. తొమ్మిది మృత దేహాల్లో  ఐదింటిని 12 వ అంతస్థులో గుర్తించారు. బాధితులు ఊపిరాడక లిఫ్ట్ లో సజీవ దహనమైనట్టు తెలుస్తోంది.ఇంత ఘోర ప్రమాదానికి కారణాలను ఇంకా పరిశీలిస్తున్నారు. అయితే ప్రమాద సమయంలో ఎలివేటర్ ను వాడిన కారణంగా తీవ్రత పెరిగిందని ప్రాథమికంగా అంచనాకు వచ్చ్చారు. ఈ ప్రమాదంలో నలుగురు అగ్నిమాపక సిబ్బంది, ఇద్దరు రైల్వే ఉద్యోగులు, ఓ అసిస్టెంట్ సబ్ ఇన్స్ పెక్టర్ సజీవ దహనమయ్యారు.

ఈ భవనంలో రెండు జోనల్ రైల్వే కార్యాలయాలు, కంప్యూటరీకరించిన టికెట్ బుకింగ్ సెంటర్ ఉన్నాయి. విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో ఆన్ లైన్ బుకింగులను కూడా నిలిపివేసినట్టు అధికారులు తెలిపారు. రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతిని ప్రకటించారు. గాయపడినవారికి  తక్షణం  మెరుగైన సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. సీఎం మమతా బెనర్జీ, కొందరు రాష్ట్ర మంత్రులు, అధికారులు ప్రమాద స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. అటు- మృతుల సంఖ్య పెరగ వచ్చునని భావిస్తున్నారు. ఈస్టర్న్ రైల్వే సెక్షన్ లో ఇంత పెద్ద ప్రమాదం జరగడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి.

మరిన్ని ఇక్కడ చదవండి:

Karthika Deepam Serial : ఓ వైపు పిల్లలతో ఊరుదాటిన దీప.. మరోవైపు మోనిత మాయలో కార్తీక్..

కంటెంట్ ఉన్న పాత్రలకే కన్ఫర్మేషన్.. మ్యాటర్ లేదంటే రిజెక్ట్.. భార్యపై పొగడ్తల వర్షం కురిపిస్తున్న తమిళ యువహీరో..

చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
అంబానీ కారు డ్రైవర్​ జీతం ఎంతో తెలుసా ?? అసలు కథ ఇది !!
అంబానీ కారు డ్రైవర్​ జీతం ఎంతో తెలుసా ?? అసలు కథ ఇది !!