Karthika Deepam Serial : ఓ వైపు పిల్లలతో ఊరుదాటిన దీప.. మరోవైపు మోనిత మాయలో కార్తీక్..

అంజిని కార్తీక్ నమ్మను అంటూ బయటకు గెంటేసిన తర్వాత మరో నాటకానికి తెరతీసిన మోనిత కార్తీక్ గుండెలను హత్తుకుని నమ్ము నమ్మినందుకు థాంక్స్ .. ఇప్పటికైనా అర్ధమయ్యిందా.. నా వెనుక ఎంత కుట్ర జరుగుతుందో....

Karthika Deepam Serial :  ఓ వైపు పిల్లలతో ఊరుదాటిన దీప.. మరోవైపు మోనిత మాయలో కార్తీక్..
Follow us

|

Updated on: Mar 09, 2021 | 10:49 AM

Karthika Deepam  : అంజిని కార్తీక్ నమ్మను అంటూ బయటకు గెంటేసిన తర్వాత మరో నాటకానికి తెరతీసిన మోనిత కార్తీక్ గుండెలను హత్తుకుని నమ్ము నమ్మినందుకు థాంక్స్ .. ఇప్పటికైనా అర్ధమయ్యిందా.. నా వెనుక ఎంత కుట్ర జరుగుతుందో.. నన్ను హంతకురాలు అన్నందుకంటే..నువ్వు ఎక్కడ నన్ను నా ప్రేమను అర్ధం చేసుకోవో.. నా ప్రేమని ఎక్కడ అవమానిస్తావా అన్న భయమే ఎక్కువ అయ్యింది.. అయితే ఇప్పుడు అర్ధమయ్యింది. నన్ను నువ్వు ఎంతగా నమ్ముతున్నావో అంటూ కన్నీరు పెడుతుంది. దీంతో కార్తీక్ … మోనితని ఉరుకోబెడతాడు. దీంతో కార్తీక్ రా మాట్లాడుకుందాం అంటూ పైకి తీసుకెళ్తుంది మోనిత.

ఇక వారణాసి బాబాయ్ ఊరు చేరుకుంటుంది దీప తన పిల్లలతో పాటు వారణాసిని తీసుకుని. అక్కడ ఓ వ్యక్తి దీపకి తనను తాను పరిచయం చేసుకుని నేను కూడా నీ తమ్ముడిని అక్క.. మీ గురించి వారణాసి ఎప్పుడు చెబుతుంటాడు.. ఇక నుంచి నీకు ఇద్దరు తమ్ముళ్లు అనుకో అంటాడు. దీంతో వారణాసి.. అక్కా ఇక నుంచి మీరు ఉండేది ఈ ఇంట్లోనే.. నేను పక్కనే ఉన్న బాబాయ్ ఇంట్లో ఉంటాను.. అద్దె ఆలస్యంగా ఇచ్చినా ఒకే అని చెబుతాడు వారణాసి. ఇంతలో ఇంట్లో సామాన్లు సర్ది దీపతో రండి అక్క సమన్లు అన్నీ సర్దేశం. అనడంతో దీప తన పిల్లలల్తో రండి ఇంట్లో దీపం వెలిగిద్దాం. పాలు పొంగించి.. పరమాన్నం వండుదాం అంటూ లోపలికి పిల్లలతో పాటు దీప అడుగు పెడుతుంది.

మరోవైపు మోనిత దగ్గర ఉన్న కార్తీక్ .. పనిమనిషి ప్రియమణిని కాఫీ అడుగుతాడు. సోఫాలో నిద్రపోతున్న మోనితని చూసి అయ్యో పాపం రాత్రంతా నా బాధ చెబుతూ.. నిద్రలేకుండా చేసినట్లు ఉన్నాను అనుకుంటున్నాడు. ప్రియమణి మా ఇద్దరికీ కాఫీ తీసుకుని రా అని చెబుతాడు. ఇంతలో మోనిత నిద్రలేచి కూర్చుంటుంది. నీకు రాత్రి నేను బాగా తాగి బోర్ కొట్టించానా అని అడుగుతాడు. అయ్యో అదేం లేదు.. నాకు కాకపోతే ఇంకెవరికి చెబుతాం అని వారిస్తుంది మోనిత. ఇంతలో ప్రియమణి వచ్చి.. పొద్దునే కాదమ్మా మీరు ఇక్కడికి వచ్చి సోఫాలో పడుకున్నారు అని అంటుంది. దీంతో మోనిత ప్రియమణి వైపు కోపంగా చూసి.. ఏం లేదు కార్తీక్ రాత్రి పైనే నిద్రపోయా.. పొద్దున్నే ఇక్కడ కి వచ్చా అని కవర్ చేస్తుంది. మరోవైపు దీప కొత్త ఇంట్లో ఎదో ఆలోచిస్తుంటే.. పిల్లలు సామాన్లు సర్దుతూ అమ్మా ఈ ఊరుకు ఎయిర్ పోర్ట్ దగ్గరగా ఉందా.. అని అడుగుతుంది శౌర్య. ఎందుకు అంటే నాన్న మనలా రైలు మీద రాలేడు కదా.. అందుకే అడుగుతున్నా అంటుంది. దీప కోపంగా మీకు ఇక నాన్న లేదు.. మీ జీవితంలో ఇక నుంచి అమ్మ మాత్రమే ఉంది. నాన్న ముగిసిన అధ్యాయం అని అంటుంది. అందుకే మీకు ముందే చెప్పా.. మీ అమ్మ కావాలో.. నాన్న కావాలో తేల్చుకోమని.. మళ్ళీ ఇంటి దగ్గర కూడా చెప్పా మీకు మీ నాన్న కావాలంటే వారణాసి దిగబెడతాడు అని .. అంటుంటే… అప్పుడు హిమ కలుగజేసుకుని నాన్న రాడు శౌర్య.. మనం వస్తుంటే నాన్న వరించలేదు.. తాను ఎప్పుడు కనిపించినా ప్రేమగా నవ్వుతు మాట్లాడమని మాట్లాడమని మాత్రమే అడిగాడు.. తను మాట్లాడితే మనం ఎలా నవ్వుతూ మాట్లాడతాం ఏడ్పు వస్తుంది కదా అంటుంది హిమ. అయితే శౌర్య నాన్న లేనప్పుడు నాన్నని గుర్తు చేసుకోవడం ఎందుకు.. ఇక నుంచి నన్ను అత్తమ్మ అని పిలవకు అని చెబుతుంది.

మరోవైపు సౌందర్య ఇంట్లో దీప , పిల్లల కోసం కంగారు పడుతుంది. ఆదిత్య వచ్చి.. లేదన్నా వదిన ఈ సారి చాలా జాగ్రత్తలు తీసుకుంది. ఎవరికీ తెలియదంటా.. అక్కడ ఉన్న వెంకటేష్ సహా అందరినీ అడిగాను. అంటుంటే ఇంట్లో ఆనందరావు ఎవరికీ బాగోలేదు అని అడుగుతుంటే.. దీపు గాడికి బాగోలేదు.. శ్రావ్య చాలా జాగ్రత్తలు తీసుకుంది అని కవర్ చేస్తుంది సౌందర్య..

ఆనందరావు కంగారు చూసి.. దీప విషయం చెప్పకపోవడమే మంచిది అయ్యింది. అనుకుంటుంది . ఇంతలో ఆనందరావు నువ్వు కార్తీక్ తో ఒకటి చెప్పాలి.. నువ్వు అయితేనే గట్టిగా చెబుతావు.. అని అంటాడు ఎం లేదు.. దీపని పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చేదాం.. అంటాడు.. ఇంతలో కార్తీక్ వస్తాడు.. రారా కార్తీక్ కారు తియ్యి పిల్లల్ని దీపని ఇంటికి తీసుకొచ్చేద్దాం.. వాళ్ళు తినడానికి కూడా లేకుండా కష్టపడుతున్నారు.. మా ఇంటి కోడల్ని ఇంట్లో లేకుండా చేయకు.. నీకు ఇష్టం లేకపోతె దీపతో మాట్లాడకు అంటాడు. ఎందుకు నాన్న జరగనివి ఆలోచిస్తావు.. కావాలంటే పిల్లల్ని తెచ్చుకుందాం.. దీప వచ్చు అంటాడు తల్లి పిల్లని ఎలా వేరు చేస్తాం పద కారు తియ్యి వెళ్దాం అని ఆనందరావు హడావిడి చేస్తుంటే.. నాన్నా మీరు రెస్ట్ తీసుకోండి అని కార్తీక్ చెబుతాడు. ఇంతలో సౌందర్య కలగ జేసుకుని ఈ ఒక్కసారికి వాడి మాట వినండి.. మీరు రెస్ట్ తీసుకోండి అంటుంది. అదేంటి నాన్న మాటకి నువ్వు వంతపాడి దీపని పిల్లల్ని తీసుకుని రమ్మనమని అంటావు అనుకుంటే .. ఇప్పుడు ఇదేమిటి అని అడుగు తాడు కార్తీక్..

ఇంతలో ఆదిత్య తండ్రికి అడ్డు పడి నేను అన్నయ్య వెళ్దాం మీరు రెస్ట్ తీసుకోండి అంటాడు… వద్దు నాకు ఎవరూ ఎం చెప్పొద్దూ.. నేను ఎవరి మాట వినను.. దీపని పిల్లల్ని తీసుకుని వద్దాం.. పెద్దోడా కారు తియ్యని చెబుతాడు ఆనందరావు. కార్తీక్ ని హడావిడి పెడుతూ.. తీసుకెళ్తుంటే.. ఇంతలో సౌందర్య ఆగండి.. దీప ఇంట్లో లేదు.. అసలు ఊరులోనే లేదు.. అంటూ కన్నీరు పెట్టుకుంటూ చెబుతుంది.. దీంతో అందరు షాక్ కి గురవుతారు. మరి దీప ప్రయాణం కొత్త జర్నీ ఎలా సాగుతుంది.. కార్తీక్ ఎప్పటికీ మోనిత మాయలోనే ఉంటాడా.. లేక పిల్లలు దీప కోసం ఆలోచిస్తాడా అనేది తెలియాలంటే.. నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే..

Also Read:

వైజాగ్‌లో పెల్లుబిక్కుతున్న ప్రజా ఆగ్రహం.. రాత్రంతా నడిరోడ్డుపైనే.. 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

మళ్లీ పెళ్లి చేసుకున్న అమెజాన్‌ వ్యవస్థాపకుడి మాజీ భార్య.. సైన్స్ టీచర్‌ను వివాహమాడిన మెకంజీ..